
నటనపై ఆసక్తి.. నెమ్మదిగా సినీరంగంలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. విశ్వాసం, నిరంతర కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించుకున్నా్డు. ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన అతడు.. విశ్వాసం, కృషి వల్లే ఇప్పుడు ప్రముఖ నటుడు, దర్శకుడిగా ఎదిగాడు. వంద రూపాయలతో మొదలైన అతని జీవితం కోటి రూపాయలుగా మారింది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఆ నటుడి పేరు బోస్ వెంకట్. తన 7 ఏళ్ల వయసులో సినిమా కలలతో చెన్నైకి వచ్చారు. సినిమా రంగం వెంటనే అందరికీ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించదు. చెన్నైకి వచ్చిన బోస్ వెంకట్‌కు ఉద్యోగం అవసరమైంది. అందుకే, ఆయన ఆటో డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. కానీ మరోవైపు, ఆయన సినిమా కలల కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‌తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
మొదట్లో మెట్టి ఒలి సీరియల్ ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత భారతీరాజా దర్శకత్వంలో 2003లో విడుదలైన ‘ఈర నీలం’ చిత్రంతో నటుడిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ‘అరసచ్చి’, ‘కన్నమ్మ’, ‘తలైనగరం’, ‘శివాజీ’, ‘ధామ్ ధూమ్’, ‘సింగం’, ‘గో’, ‘గంగ్వా’, ‘విడుతులై 2’ వంటి పలు చిత్రాల్లో నటించారు. మలయాళం, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..
బోస్ వెంకట్.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తానెంటో నిరూపించుకున్నాడు. 2006లో వచ్చిన లక్ష్మీ సౌభాగ్యవతి సినిమాతో నటుడిగా మారిన ఆయన.. రంగం మూవీలో కీలకపాత్ర పోషించారు. కార్తీ కథానాయకుడిగా నటించిన ఖైదీ సినిమా ద్వారా పాపులర్ అయ్యారు. ఆయన నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సుపరిచితులు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..
Bose Venkat New
ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‌లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..