Tollywood : ఒకప్పుడు జేబులో 20 రూపాయాలు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు.. ఈ స్టార్ హీరో ఎవరంటే..

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. కానీ ఆ సవాళ్లను స్వీకరించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్టార్ ఒకరు. ఒకప్పుడు జేబులో 18 రూపాయలతో తిరిగాడు. ఇప్పుడు అతను కోటి రూపాయల సంపదకు యజమాని. ఇంతకీ ఎవరంటే..

Tollywood : ఒకప్పుడు జేబులో 20 రూపాయాలు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు.. ఈ స్టార్ హీరో ఎవరంటే..
Rajkummar Rao

Updated on: Aug 31, 2025 | 12:53 PM

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో అతడు స్టార్ హీరో. విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ తన నటనతో, కామెడీ టైమింగ్ తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఒకప్పుడు జేబులో 18 రూపాయాలతో తిరిగిన కుర్రాడు.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు తీసుకుంటున్నాడు. అతడు రాగిణి ఎంఎంఎస్, షైతాన్, కై పో చే, షాహిద్ వంటి చిత్రాల్లో నటించి మరింత ఫేమస్ అయ్యాడు. అతడు మరెవరో కాదు.. రాజ్ కుమార్ రావు.

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

ఇవి కూడా చదవండి

నటుడు రాజ్ కుమార్ రావుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. పదవ తరగతిలోనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్లోనే థియేటర్ లో వర్క్ చేశాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. FTII పూణే అర్హత పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. కాలేజీ రోజుల్లోనే గురుగ్రామ్ నుంచి ఢిల్లీలో నాటకాల్లో పనిచేయడానికి వచ్చేవారట. క్షితిజ్ రిపెర్టరీ, శ్రీరామ్ సెంటర్‌లో నాటకాల్లో నటించేవాడు. ఆ తర్వాత అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఆ సమయంలో తనకు నెలకు రూ.16 వేల వరకు ఖర్చు అయ్యేదని.. ఆ సమయంలో తన వద్ద రూ.18 మాత్రమే మిగిలాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

షాహిద్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఇటీవల ఆయన నటించిన స్త్రీ 2 సినిమా రూ.800 కోట్లు రాబట్టింది. నివేదికల ప్రకారం అతడి ఆస్తుల విలువ రూ.81 కోట్లు. ఒక్కో సినిమాకు దాదాపు రూ.6 కోట్లు తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..