Baby Movie: బేబీ సినిమాలో వైష్ణవిని పెళ్లి చేసుకున్నది ఆ స్టార్‌ డైరెక్టర్‌ తమ్ముడా? అతని బ్యా గ్రౌండ్ ఇదే..

|

Sep 15, 2023 | 9:16 AM

బేబీ సినిమాకు క్లైమాక్స్‌ హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆనంద్‌, విరాజ్‌లను కాదని హీరోయిన్‌ వైష్ణవి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అతను ఆ ఒక్క షాట్‌లో మాత్రమే కనిపించినా తెగ ఫేమస్‌ అయిపోయాడు. సోషల్‌ మీడియాలోనూ ఈ పెళ్లి కొడుకు గురించి మార్మోగిపోయింది. అతనిపై మీమ్స్‌ కూడా తెగ వైరల్‌అయిపోయాయి. అదే సమయంలో వైష్ణవిని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఎవరా? అని చాలామంది ఆరా తీశారు.

Baby Movie: బేబీ సినిమాలో వైష్ణవిని పెళ్లి చేసుకున్నది ఆ స్టార్‌ డైరెక్టర్‌ తమ్ముడా? అతని బ్యా గ్రౌండ్ ఇదే..
Krishna Mallidi In Baby Movie
Follow us on

ఈ ఏడాది అతిపెద్ద విజయం సాధించిన చిన్న సినిమాల్లో వైష్ణవి చైతన్య ‘బేబీ’ సినిమా ముందుంటుంది. సాయి రాజేష్‌ తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీలో ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలు పోషించారు. జులై 14న విడుదలైన బేబీ సినిమా యూత్‌కు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఆ తర్వాత ఆహా ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిస్‌ సొంతం చేసుకుంది. త్వరలోనే టీవీలో కూడా ఈ సినిమా రానుంది. ఇదిలా ఉంటే బేబీ సినిమాకు క్లైమాక్స్‌ హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆనంద్‌, విరాజ్‌లను కాదని హీరోయిన్‌ వైష్ణవి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అతను ఆ ఒక్క షాట్‌లో మాత్రమే కనిపించినా తెగ ఫేమస్‌ అయిపోయాడు. సోషల్‌ మీడియాలోనూ ఈ పెళ్లి కొడుకు గురించి మార్మోగిపోయింది. అతనిపై మీమ్స్‌ కూడా తెగ వైరల్‌అయిపోయాయి. అదే సమయంలో వైష్ణవిని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఎవరా? అని చాలామంది ఆరా తీశారు. ఈనేపథ్యంలోనే ఓ టీవీ షోలో తళుక్కున మెరిశాడీ నటుడు. దీంతో అతను ఎవరు? బ్యాగ్రౌండ్‌ ఏమిటి? తదితర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని పేరు మల్లిడి కృష్ణ. బేబీ కన్నా ముందే పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు. ముఖ్యంగా బేబీ డైరెక్టర్‌ సాయి రాజేష్‌ నిర్మించిన కలర్‌ ఫొటో సినిమాలో హీరో సుహాస్‌కు సీనియర్‌గా కనిపిస్తాడు. అయితే చాలా సినిమాలు చేసినా కృష్ణకు సరైన బ్రేక్‌ రాలేదు.

అయితే బేబీ సినిమాలో ఒక్క పెళ్లి సీన్‌లో నటించి తెగ పాపులర్‌ అయిపోయాడు కృష్ణ మల్లిడి. ఇక ఈ యాక్టర్‌ మరెవరో కాదు.. కల్యాణ్‌ రామ్‌తో బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన మల్లిడి వశిష్టకి సోదరుడట. వశిష్ట తండ్రి గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలా సినీ ఫ్యామిలీ నేపథ్యమున్న ఫ్యామిలీ నుంచే కృష్ణ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కృష్ణ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే స్టార్‌ యాంకర్‌తో విష్ణుప్రియతో దిగిన పలు ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో ఆమె కూడా కృష్ణకు రిలేటివ్ అవుతుందిని తెలుస్తోంది. కొంతమంది వారిద్దరు స్నేహితులు అంటుంటే, మరికొందరు దగ్గరి బంధువులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా వశిష్ట మల్లిడి ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

యాంకర్ విష్ణుప్రియతో ‘బేబీ’ యాక్టర్

కలర్ ఫొటో సినిమాలో కృష్ణ మల్లిడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.