Nuvvu Naaku Nachav: ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?

విక్టరీ వెంకటేష్ నటించిన కల్ట్ క్లాసిక్ నువ్వు నాకు నచ్చావ్ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. కొత్త సంవత్సరం కానుకగా గురువారం (జనవరి 01)న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

Nuvvu Naaku Nachav: నువ్వు నాకు నచ్చావ్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?
Nuvvu Naaku Nachav Movie

Updated on: Dec 31, 2025 | 6:09 PM

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్ ఉండచ్చు గాక.. కానీ ‘నువ్వు నాకు నచ్చావ్’ వెంకీ కెరీర్ లోనే చాలా స్పెషల్.. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువైపోయాడు వెంకటేష్. 2001లో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇప్పటికీ టీవీలో ఈ మూవీ వస్తే ఛానెల్ మార్చకుండా చూసే వారు చాలా మందే ఉన్నారు. విక్టరీ వెంకటేష్ నటన, ఆర్తీ ఆగర్వాల్ అంద చందాలు, బ్రహ్మానందం కామెడీ, పాటలు.. ఇలా నువ్వు నాకు నచ్చావ్ సినిమా సక్సెస్ అవడానికి చాలా అంశాలు దోహదం చేశాయి. తెలుగు కల్ట్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. కొత్త సంవత్సరం కానుకగా గురువారం (జనవరి 01)న 4K రెజల్యూషన్స్ తో రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నువ్వు నాకు నచ్చావ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి.

నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు కే. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రైటర్ గా వ్యవహరించారు.ఈ మూవీకి ముందు వీరి కాంబినేషన్ లో నువ్వే కావాలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. దీంతో ఇదే కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్‌ చేశారు నిర్మాత స్రవంతి రవికిషోర్‌. ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించేలా ఓ కథ చెప్పమని అడిగితే, వారు ‘నువ్వు నాకు నచ్చావ్‌’ వినిపించారు. ఇది కూడా అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న తరుణ్‌తోనే తీస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే ఎమోషనల్ సబ్జెక్ట్‌ కావడంతో మరో హీరోతో ప్లాన్ చేశారు. అదే సమయంలో నిర్మాత సురేష్ బాబు స్రవంతి రవికిషోర్ కు ఫోన్ చేశారు. వెంకటేశ్‌ డేట్స్‌ ఉన్నాయని చెప్పారు. దీంతో దర్శకుడు విజయ్‌ భాస్కర్‌, త్రివిక్రమ్‌లు కలిసి వెంకటేశ్‌ ను కలిసి కథ వినిపించారు. కథ విన్న వెంకీ వెంటనే ఓకే చెప్పారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా త్రిష కానీ గజాలాను కానీ తీసుకోవాలనుకున్నారు. అయితే అప్పటికే ఓ హిందీ సినిమా చేసిన ఆర్తి అగర్వాల్‌ ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. ఇక హీరోయిన్ తండ్రి పాత్ర కోసం ముందుగా నాజర్‌ను అనుకున్నారు దర్శకుడు విజయ్‌భాస్కర్‌ సూచించారు. కానీ, స్రవంతి రవికిషోర్‌ మాత్రం ప్రకాశ్‌రాజ్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా మొత్తానికి నువ్వు నాకు నచ్చావ్ సినిమా పట్టాలెక్కింది. సూపర్ హిట్ గా చింది. వెంకీ కెరీర్ లో ఈ మూవీ ఓ మరపురాని చిత్రంగా మిగిలిపోతే, ఆర్తి అగర్వాల్ కు బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

నువ్వు నాకు నచ్చావ్ 4K ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.