ప్రేమి విశ్వనాథ్.. ఈ పేరు మన తెలుగు ప్రేక్షకుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ వంటలక్క అంటే ఠక్కున అందరికీ గుర్తొస్తుంది. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. ఒకే ఒక్క ‘కార్తిక దీపం’ సీరియల్‌తో తెలుగులో తెగ ఫేమస్ అయింది. ఇక ఆ సీరియల్ తెచ్చిన క్రేజ్‌తో.. ఈమెకు ఇటీవల వరుసపెట్టి ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. అటు సీరియల్స్.. ఇటు యాడ్స్‌తో పాటు నాగచైతన్య హీరోగా వచ్చిన ‘కస్టడీ’ సినిమాలోనూ కీలక పాత్రలో నటించింది ప్రేమి విశ్వనాథ్.
ఇదిలా ఉండగా.. ప్రేమి విశ్వనాథ్ ఆస్తుల విషయంపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంటలక్క ఆస్తులు సుమారు రూ. 40 కోట్లు ఉండచ్చునని అంచనా. ఆమెకు కేరళలో రెండు స్టూడియోలు కూడా ఉన్నాయట. అలాగే వంటలక్క ‘కార్తికదీపం’ సీరియల్‌లో నటిస్తూనే ‘ఫ్లవర్స్ టీవీ’లో ఓ హోస్ట్‌గా చేస్తోందట. అటు ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ఆస్ట్రాలజర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళంలో ‘సాల్మన్ 3D’ అనే చిత్రంలో నటిస్తోంది ప్రేమి విశ్వనాథ్. అటు మలయాళంలో ‘అకమే’ అనే షార్ట్ ఫిలింలో నటించి.. ప్రొడ్యూస్ చేసింది ఈ బ్యూటీ.
ఇది చదవండి: లిప్‌లాక్స్‌తో ఛాన్స్‌లు మిస్.. ఒక్క మూవీతోనే తిరుగులేని స్టార్‌డమ్.. ఈ గ్లామర్ డాల్ ఎవరో తెల్సా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి