
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా హీరో విజయ్ పాలనా పగ్గాలు స్వీకరించారు. ఆదివారం (మే 10) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మరుక్షణమే తానిచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. కీలకమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు. ఇదిలా ఉంటే విజయ్ కు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుపాకీ సినిమా తర్వాత తెలుగులో ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. అప్పటి నుంచి విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతూ వస్తోంది. తమిళంలో మాదిరే ఇక్కడ కూడా ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇక టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారిసు (తెలుగులో వారసుడు) సినిమాలోనూ హీరోగా చేశారు విజయ్. ఇక విజయ్ ఎన్నికల్లో గెలవగానే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ తదితర టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు విజయ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి తెలుగు హీరోలు, హీరోయిన్లతోనూ విజయ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. మరి విజయ్ కు తెలుగులో బాగా ఇష్టమైన హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అలాగే తెలుగు రాష్ట్రాల్లో విజయ్ కు బాగా ఇష్టమైన పొలిటిషన్ ఎవరు? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇదే విషయంపై పలు సందర్బాల్లో మాట్లాడారు విజయ్. తెలుగు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో పేర్కొన్నారీ తమిళనాడు ముఖ్యమంత్రి. అలాగే బంగారం సినిమా ఈవెంట్ కు హాజరైన ఆయన పవన్ కల్యాణ్ అంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే.. ఏపీ డిప్యూటీ సీఎం, పవన్ కల్యాణ్ ల గురించి పలు సందర్భాల్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు విజయ్. జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ పాలిటిక్స్ లోకి వచ్చానని విజయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదే విసయాన్ని కోలీవుడ్ మీడియా సైతం హైలెట్ చేసింది. విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో మరోసారి ఈ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
My heartfelt thanks to the Leader of Opposition in Lok Sabha, Thiru @RahulGandhi ji, for gracing my swearing-in ceremony with his presence. Your support and kind wishes are truly appreciated as we embark on this journey to serve the people. https://t.co/uEsmWPDz8P
— TVK Vijay (@TVKVijayHQ) May 10, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.