Balu Movie: పవర్ స్టార్ బాలు సినిమాలో ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

|

Mar 05, 2023 | 5:17 PM

ఈ సినిమాలో పవన్ స్టైల్, ఆయన యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2005లో వచ్చిన ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు.

Balu Movie: పవర్ స్టార్ బాలు సినిమాలో ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Balu
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో కమర్షియల్ హిట్ గా నిలవకపోయినా అభిమానులకు, ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో బాలు సినిమా ఒకటి. ఈ సినిమాలో పవన్ స్టైల్, ఆయన యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2005లో వచ్చిన ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సి. అశ్విని దత్ తన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌పై నిర్మించారు. ఇక ఈ సినిమాలో ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రియ ,   నేహా ఒబెరాయ్ హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ హీరోయిన్స్‌లో శ్రియ ఇప్పుడు ఎలా ఉన్నారో అందరికి తెలుసు ఆమె ఇప్పటికీ సినిమాలతో.. సోషల్ మీడియాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అయితే మరో హీరోయిన్ నేహా ఒబెరాయ్ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..? నేహా ఒబెరాయ్ బాలు సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేసింది. జగపతి బాబు నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో చేసింది ఈ భామ. ఆ తర్వాత ఆమె హిందీలో నటించింది.

అయితే ఈ భామ 2009 తర్వాత సినిమాలకు దూరమైంది. 2010లో విశాల్ షా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చేసి వ్యాపారాలు చూసుకుంటోంది ఈ భామ. అయితే ఈ అమ్మడి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Neha