
ప్రియాంక అరుళ్ మోహన్.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్. ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఈ బ్యూటీ బిజీగానే ఉంది. మొదట కన్నడలో తొలిసారిగా నటించిన ప్రియాంక ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ ప్రియాంకకు మాత్రం అవకాశాలు రాలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో నటిస్తుంది. అలాగ నాని నటిస్తోన్న సరిపోదా శనివారం మూవీలోనూ కనిపించనుంది. అటు తమిళంలోనూ ఈ బ్యూటికి అవకాశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 20న ప్రియాంక పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంకకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ప్రియాంక తండ్రి తమిళ్.. తల్లి కన్నడ. ఆమె 20 నవంబర్ 1994న చెన్నైలో జన్మించారు. శివకార్తికేయన్ సరసన డాక్టర్ సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తెలుగులో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో రెండు, కన్నడలో ఒకటి.. ఇలా ఇప్పటివరకు మొత్తం ఆరు సినిమాలు విడుదలయ్యాయి. ఒక్కో సినిమాకు ప్రియాంక రూ.30 నుంచి రూ. 50 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఆస్తి వివరాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ప్రియాంక సంపాదన మొత్తం రూ.12 కోట్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఇటీవలే చెన్నైలో కొత్త అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఈ బ్యూటీకి పాటలు వినడం ఇష్టం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో వరుసగా నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి ధనుష్ జోడిగా కెప్టెన్ మిల్లర్, తెలుగులో ఓజీ, సరిపోదా శనివారం, తమిళంలో జయం రవి సరసన బ్రదర్ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని చిత్రాల్లోనూ ప్రియాంక నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చేసింది ఆరు సినిమాలే అయినా.. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.