వీరమల్లు, కింగ్‌డమ్ సినిమాల్లో మెరిసిన ఈ నటుడు డైరెక్టర్ అని తెలుసా? కుమారుడు కూడా టాలీవుడ్‌ క్రేజీ హీరో

అయ్యప్ప పి శర్మ.. ఈ పేరు చెబితే చాలామందికి గుర్తుకు రాకపోవచ్చు. అయితే కేజీఎఫ్, అఖండ సినిమాలు చూసిన వారు పై ఫొటోను చూస్తే ఇట్టే గుర్తు పడతారు. లేటెస్ట్ గా పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడీ సీనియర్ యాక్టర్.

వీరమల్లు, కింగ్‌డమ్ సినిమాల్లో మెరిసిన ఈ నటుడు డైరెక్టర్ అని తెలుసా? కుమారుడు కూడా టాలీవుడ్‌ క్రేజీ హీరో
Actor Ayyappa P Sharma

Updated on: Aug 27, 2025 | 1:19 PM

తెలుగులో తక్కువ సినిమాలు చేసిన అయప్ప శర్మ ఎక్కువగా కన్నడ నిమాల్లో కనిపిస్తాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. అలాగే నిర్మాతగానూ వ్యవహరించాడు. అయితే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు అయ్యప్ప. ఈ టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేజీఎఫ్ సినిమాతో ఈ నటుడి పేరు మార్మోగిపోయింది. ఇందులో హీరో యష్‌కు తోడుగా వానరం అనే పాత్రలో అదరగొట్టేశాడు అయ్యప్ప. అలాగే బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాలోనూ విలన్ గా మెప్పించాడు. ఇందులో ఆయన పోషించిన ఆత్మ పాత్ర కు కూడా మంచి పేరొచ్చింది. ఇక నందమూరి కల్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ మూవీ బింబిసారలో కేతుగా మరో డిఫరెంట్ రోల్ లో కనిపించాడు. ఇవే కాదు సందీప్ కిషన్ మైఖెల్, శివం భజే, తగ్గేదేలే, తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్, బాహుబలి ద కంక్లూజన్, లచ్చిందేవికి ఓ లెక్కుంది, అరవింద సమేత, కాటమ రాయుడు తదితర తెలుగు సినిమాల్లోనూ వివిధ పాత్రల్లో కనిపించాడు అయ్యప్ప.

ఇక లేటెస్ట్ గా పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లులోనూ అబ్దుల్లా అనే పాత్రలో ఆకట్టుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ లోనూ భైరాగీగా అలరించాడు. ఎక్కువగా కన్నడ సినిమాల్లో కనిపించే ఈ నటుడు మన తెలుగు వాడే. టాలీవుడ్ సీనియర్ నటుడు పీజే శర్మ ముగ్గురి కొడుకుల్లో అయ్యప్ప శర్మ కూడా ఒకరు. అంటే మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ కు చిన్న తమ్ముడు అవుతాడు. అలాగే ఇక కన్నడ నటుడు, అరుంధతి పశుపతి క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ కూడా.. అయ్యప్పకు అన్న అవుతాడు. ఇలా వరుసలు చూస్తుంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వెలుగొందుతోన్న ఆది సాయి కుమార్ అయ్యప్ప శర్మకు కొడుకు వరుస అవుతాడు.

ఇవి కూడా చదవండి

Sai Kumar Family

 

కెరీర్ ప్రారంభంలో సాయి కుమార్ నటించిన ‘ఈశ్వర్ అల్లా’ చిత్రానికి దర్శకత్వం వహించాడు అయ్యప్ప. అలాగే నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. అలాగే హైదరాబాద్‌లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా కొద్ది కాలం పాటు పని చేశాడు.
ఇక ఆది సాయి కుమార్ విషయానికి వస్తే.. జయా పజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నాడు. థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఈ హీరో సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతున్నాయి. ఇటీవల షణ్మఖ సినిమతో అలరించిన ఆది చేతిలో ప్రస్తుతం ఐదారు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి