ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఆర్య. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్, ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు ఈ లెక్కల మాస్టర్. యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన స్టైల్ ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే ఈ సినిమాలోని పాటలు అప్పట్లో మారుమ్రోగాయి. ఇప్పటికి ఈ సినిమాలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాలో బన్నీ చుట్టూ కొంతమంది పిల్లలు కనిపిస్తారు.
ఆ పిల్లలో ఓ క్రేజీ హీరోయిన్ కూడా ఉంది. ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ చిన్నది. ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. ఆ చిన్నారి ఎవరో కాదు నటి శ్రావ్య. అల్లు అర్జున్ తో ఉండే చిన్నారుల్లో కాస్త పెద్దగా కనిపించే ఆ చిన్నారి శ్రావ్య. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రావ్య ఇప్పుడు హీరోయిన్ గా మారింది. పలు సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది.
లవ్ యు బంగారం సినిమాతో పాటు కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కన్నడ సినిమా రోజ్ తో పాటు తెలుగులో కాయ్ రాజా కాయ్, సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చేసిన నందిని నర్సింగ్ హోం మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి. అలాగే తమిళంలో పగిరి, విలాయట్టు ఆరంభం సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. తన బ్యూటీఫుల్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.