తస్సాదియ్యా..! గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలు గత్తర లేపిందిగా..!

| Edited By: Ravi Kiran

Jul 25, 2024 | 10:48 AM

ఒకొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు మెగా పవర్ స్టార్. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను లైనప్ చేశాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

తస్సాదియ్యా..! గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్ చెల్లెలు గత్తర లేపిందిగా..!
Actress
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఒకొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు మెగా పవర్ స్టార్. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను లైనప్ చేశాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే సినిమా ఒకటి.

ఇదికూడా చదవండి : అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమాలో చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఆ బ్యూటీ పేరు అయేషా కాదుస్కర్. గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది కొంతసేపు అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. అయితే చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలానే ఉండే ఈ అమ్మడు ముంబై కి చెందని నటి. 2012లో వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ సినిమాలో నటించింది అయేషా.. ఆతర్వాత 2014లో టాలీవుడ్ లో గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో చేయలేదు ఈ చిన్నది. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యమా యాక్టివ్ గా ఉంటుంది. రోజు రకరకాల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది అయేషా. ఈ క్రమంలోనే ఈచిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.