Rambha : యాక్సిడెంట్ తర్వాత హీరోయిన్ రంభ ఎలా ఉన్నారో తెలుసా..? వైరల్ అవుతోన్న ఫొటోస్

|

Feb 14, 2023 | 3:31 PM

తొలి సినిమాతోనే అందం అభినయంతో మెప్పించింది ఈ బ్యూటీ. ఇక తక్కువ సమయంలోనే రంభ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది.

Rambha : యాక్సిడెంట్ తర్వాత హీరోయిన్ రంభ ఎలా ఉన్నారో తెలుసా..? వైరల్ అవుతోన్న ఫొటోస్
Rambha
Follow us on

ఒకప్పటి క్రేజీ హీరోయిన్స్ లో రంభ ఒకరు. గ్లామరస్ స్టార్ గా అప్పట్లో దూసుకుపోయింది ఈ చిన్నది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో మెప్పించింది ఈ బ్యూటీ. ఇక తక్కువ సమయంలోనే రంభ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రంభ వివాహం తర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ మెరిసింది. ఇదిలా ఉంటే రంభ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల రంభ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గతఏడాది నవంబర్ లో రంభ ప్రయాణిస్తోన్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, ఇంట్లో పనిచేసే ఆయా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని రంభే సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో తనతో పాటు అందరికీ గాయాలయ్యాయని రంభ వాపోయింది. అయితే దేవుడి దయవల్ల అవన్నీ చిన్న గాయాలేనని, తన కూతురు సాషా కు మాత్రం కాస్త ఎక్కువ గాయాలు అయ్యాయని తెలిపింది.

అయితే ప్రమాదం తర్వాత రంభ ఎలా ఉన్నారు అంటూ కొందరు సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే గాయాలనుంచి రంభ పూర్తిగా కోలుకున్నారు. ఎప్పటిలానే యాక్టివ్ గా అంతే అందంగా కనిపిస్తున్నారు ఏ ఫొటోస్ లో.. రంభ లేటెస్ట్ ఫొటోస్, వీడియోల పై మీరూ ఒక లుక్కేయండి.