Dhurandhar Movie: ‘ధురంధర్’ మూవీ హీరోయిన్ తండ్రి టాలీవుడ్‌ స్టార్ నటుడని తెలుసా? విజయ్, రష్మికలతో సినిమాలు

రణ్ వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమా కలెక్షన్లు వెయ్యి కోట్లకు చేరువలో ఉన్నాయి. కాగా ఈ స్పై థ్రిల్లర్ మూవీలో రణ్ వీర్ సరసన సారా అర్జున్ కథానాయికగా నటించింది.

Dhurandhar Movie: ధురంధర్ మూవీ హీరోయిన్ తండ్రి టాలీవుడ్‌ స్టార్ నటుడని తెలుసా? విజయ్, రష్మికలతో సినిమాలు
Dhurandhar movie actress Sara Arjun

Updated on: Dec 25, 2025 | 5:41 PM

ధురంధర్ సినిమా జోరు ఆగడం లేదు. డిసెంబర్ 05న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ మూవీ కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటికే కాంతార 2 సినిమాను అధిగమించిన ధురంధర్ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు రూ. 1000 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఉరి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ఆధిత్య ధార్ ధురంధర్ సినిమాను తెరకెక్కించారు. హీరో రణ్‌వీర్ సింగ్ గూఢచారి పాత్రలో అదరగొట్టాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి టాప్ స్టార్స్ కూడా టెర్రిఫిక్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక వీరితో పాటు ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ ప్రియురాలిగా ఒకప్పటి ఛైల్డ్ ఆర్టిస్ట్ నాన్న మూవీ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా ఆమెకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకున్నా తన క్యూట్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది సారా అర్జున్.

కాగా విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది సారా అర్జున్. అందులో ఆమె చేసిన యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ కు సౌత్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఇదే కాదు పలు హిందీ, తెలుగు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసింది సారా. స్టార్ హీరోలు, హీరోయిన్లతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక దురంధర్ కు ముందు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది సారా. అందులో చిన్నప్పటి ఐశ్వర్యారాయ్ గా ఎంతో క్యూట్ గా కనిపించిందీ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

తండ్రి అర్జున్ రాజ్ తో ధురంధర్ హీరోయిన్..

అన్నట్లు సారా అర్జున్ తండ్రి కూడా ప్రముఖ నటుడే. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లోనూ నటించాడు. విజయ్ దేవరకొండ, రష్మిక హీరో, హీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రెడ్ సినిమాలో రష్మికను
వేధించే కోచ్ పాత్రలో నటించింది అర్జున్ రాజే. దీంతో పాటు ఆనంద్ దేవరకొండ గం గం గణేశాలోనూ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక గద్దర్ అవార్డు అందుకున్న రజాకార్ మూవీలో కరుడు గట్టిన నిజాం ప్రభువుగా, నిరంకుశవాదిగా ఖాసీం రజ్వీ పాత్రలో అద్భుతంగా నటించాడు అర్జున్ రాజ్. ఈ సినిమాను చూసి చాలా మంది అతనిని అసహ్యించుకున్నారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు అర్జున్ రాజ్. వీటితో పాటు అంజలి, చాందీని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఝాన్సీ వెబ్ సిరీస్ లో క్యాలెబ్ అనే డిఫరెంట్ రోల్ లో మెరిశాడు అర్జున్ రాజ్.

రజాకార్ సినిమాలో అర్జున్ రాజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి