
కొన్ని చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా రామ్ చరణ్ పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 230 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆదివారం (జూన్ 07) వీకెండ్ కావడంతో ఈ లెక్కలు మరింత పెరిగే అవకాశముంది. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ గా, కుస్తీ యోధుడిగా, బ్లేడ్ రన్నర్ గా మూడు డిఫరెంట్ పాత్రలు పోషించాడు. తన అద్భుతమైన నటనతో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు చాలా మంది ఆడియెన్స్ రామ్ చరణ్ యాక్టింగ్ కోసమే పెద్ది సినిమాకు వెళుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాగా ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఆకట్టుకుంది. అలాగే శివరాజ్ కుమార్ జగపతిబాబు, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, టినూ ఆనంద్, శ్రీకాంత్ అయ్యంగార్, హరీష్ పేరడి, తారక్ పొన్నప్ప, మహేష్ అచంట.. ఇలా పెద్ది సినిమాలో చాలా మంది స్టార్స్ కనిపిస్తారు. అయితే పెద్ది సినిమాలో బాగా హైలెట్ గా నిలిచిన రోల్ దివ్యేందు శర్మది అని చెప్పుకోవచ్చు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నాగా నటించి నేషనల్ వైడ్ పాపులర్ అయిన దివ్యేందు ఈ సినిమాలో రామ్ బుజ్జి అనే పాత్రలో కనిపించాడు. స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ తనదైన యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
అయితే పెద్ది సినిమాలో రామ్ బుజ్జి పాత్రకు దివ్యేందు ఫస్ట్ ఛాయిస్ కాదట. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ పాత్ర కోసం పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ ని అనుకున్నారట. పెద్ది కథతో పాటు తన రోల్ గురించి కూడా చెప్పారట. సరోజ కుమార్ కు కూడ ఈ రోల్ బాగా నచ్చేసిందట. అయితే అప్పటికే తన చేతిలో చాలా సినిమాలు ఉండడం, పైగా సహాయక పాత్ర కావడంతో పెద్ది సినిమా చేయలేనని సున్నితంగా తిరస్కరించాడట. ఈ విషయాన్ని స్వయంగా బండి సరోజ్ కుమారే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అయితే పెద్ది సినిమాను రిజెక్ట్ చేసినా కూడా తన పరాక్రమం ఈవెంట్ కు బుచ్చిబాబు ఏమి మనసులో పెట్టుకోకుండా హాజరయ్యాడని సరోజ్ చెప్పుకొచ్చాడు. పెద్ది సినిమా రిలీజ్ నేపథ్యంలో పబ్లిక్ స్టార్ కామెంట్స్ ఇప్పడు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక వేళ దివ్యేందు బదులు బండి సరోజ్ కుమార్ రామ్ బుజ్జి రోల్ చేసి ఉంటే మరింత మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి