ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్ తండ్రి ఈయన.. ఎవరంటే.!

త్రోబ్యాక్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక ట్రెండ్‌లా మారాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమ చిన్ననాటి ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి ఫోటోలు పోస్ట్‌ చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒకరి..

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్ తండ్రి ఈయన.. ఎవరంటే.!
Tollywood

Updated on: May 18, 2024 | 1:37 PM

త్రోబ్యాక్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక ట్రెండ్‌లా మారాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమ చిన్ననాటి ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి ఫోటోలు పోస్ట్‌ చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒకరి రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఎవరో మీరు గుర్తుపట్టాలి. ఓ టాలీవుడ్ సూపర్ స్టార్ తండ్రి. సారీ.. సారీ.. పాన్ ఇండియా సూపర్ స్టార్ తండ్రి ఈయన. టాలీవుడ్ ఇండస్ట్రీని దేశమంతా కాదు.. ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఫ్యాన్ బేస్‌ని కూడా హైదరాబాద్ నుంచి జపాన్ వరకు పెంచుకున్నారు. అలాగే ఈ హీరో ఒకే ఒక్క సినిమాతో అటు బాలీవుడ్ ఖాన్లకు సైతం దడపుట్టించాడు. అతడు మరెవరో కాదండీ.. రెబల్ స్టార్ ప్రభాస్.

ఇక ఈ ఫోటోలోని వ్యక్తి ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ఈయన రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు. నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు.. గోపికృష్ణ మూవీస్ బ్యానర్‌పై కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, మనవూరి పాండవులు, మధుర స్వప్నం, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు లాంటి సినిమాలు నిర్మించాడు. ఇక ఇవన్నింటిలో కూడా హీరోగా నటించింది కృష్ణంరాజు. అలాగే ఈ బ్యానర్‌పై ప్రభాస్ నటించిన ‘బిల్లా’ సినిమా కూడా నిర్మించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం..