Tollywood : టాలీవుడ్ సెలబ్రెటీల ఇంట దీపావళి సంబరాలు.. ఫోటోలు వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్ కు స్టార్ హీరోలు హీరోయిన్స్ తరలి వచ్చారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసున్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోలంతా ఇలా ఒకే ఫేమ్ లో కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్ కు స్టార్ హీరోలు హీరోయిన్స్ తరలి వచ్చారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసున్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోలంతా ఇలా ఒకే ఫేమ్ లో కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు.
View this post on Instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట దీపావళి సంబరాలు అంబరాన్ని తక్కాయి. మహేష్ బాబు ముద్దుల కూతురు సితార.. ఇలా ముగ్గులు వేస్తూ కనిపించింది.
View this post on Instagram
ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన వితిక ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. దీపావళి సెలబ్రేషన్ కూడా సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది.
View this post on Instagram
బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆట సందీప్ ఓ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వీడియోను షేర్ చేశారు.
View this post on Instagram
అందాల భామ పూజా హెగ్డే దీపావళి సందర్భంగా అదిరిపోయే ఫోటోను అభిమానులతో పంచుకుంది.
View this post on Instagram
విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ఫ్యామిలీ మ్యాన్ సినిమా పోస్టర్ ను షేర్ చేశారు. ఈ పోస్టర్ లో మృణాల్ ఠాకూర్ కూడా ఉంది.
View this post on Instagram
పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది పాయల్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.