Divyansha Kaushik: మాస్ రాజా సినిమాపైనే ఆశలు పెట్టుకున్న మజిలీ భామ

టాలీవుడ్ కు ఇటీవల కాలంలో చాలా మంది అందాల భామలు పరిచయం అయ్యారు. కొత్త అందాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్స్ గా మారిన బ్యూటీస్ ఉన్నారు.

Divyansha Kaushik: మాస్ రాజా సినిమాపైనే ఆశలు పెట్టుకున్న మజిలీ భామ
Divyansha Kaushik
Follow us

|

Updated on: Jul 16, 2022 | 2:06 AM

టాలీవుడ్ కు ఇటీవల కాలంలో చాలా మంది అందాల భామలు పరిచయం అయ్యారు. కొత్త అందాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్స్ గా మారిన బ్యూటీస్ ఉన్నారు. అలాగే తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మలు కూడా తెలుగులో ఉన్నారు. ఇదే ఆశతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది వయ్యారి భామ దివ్యాంశ కౌశిక్.(Divyansha Kaushik). నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాతో పరిచయం అయింది దివ్యాన్ష. ఈ సినిమాలో చైతూ లవర్ గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ అంతా సమంతకు దక్కింది. మజిలీ సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మజిలీ సినిమా తర్వాత ఈ చిన్నది ఎక్కువగా కనిపించలేదు.

ఇక ఇప్పటికి మాస్ రాజా రవితేజ హీరోగా వస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తోంది దివ్యాన్ష. శరత్ మండవ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ చేయనున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ తో అంచనాలు మరింత పెరిగాయి.దాంతో దివ్యాంశ కౌశిక్. ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే దివ్యాంశ కౌశిక్కు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చి బిజీ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ చిన్నది ఆశలు నెరవేరుతాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి