NTR: ఎన్టీఆర్‏తో ఆ సినిమా చేసేందుకు అంతా రెడీ.. కొడాలి నాని వద్దనడంతో .. వివి వినాయక్ కామెంట్స్..

|

Jul 20, 2022 | 9:45 AM

ఈ సినిమా మొత్తం అనుకున్న తర్వాత కొడాలి నాని వచ్చి.. మనకి లవ్ స్టోరీలు వద్దు. ఇప్పుడు ఆ డైరెక్టర్‍‏తో మనకెందుకు ? అని ఆయన ఎన్టీఆర్‏తో అన్నారు.

NTR: ఎన్టీఆర్‏తో ఆ సినిమా చేసేందుకు అంతా రెడీ.. కొడాలి నాని వద్దనడంతో .. వివి వినాయక్ కామెంట్స్..
Ntr
Follow us on

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించి చిత్రపరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో వివి వినాయక్ ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఆది. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2002లో ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‏లోనే అతి పెద్ద విజయం సాధించింది. ఈ మూవీతో తారక్‏లోని మాస్ యాంగిల్ బయటకు వచ్చేసింది. ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఈ సినిమాకు ముందు తారక్ కు మరో కథ చెప్పారట. నిజానికి వివి వినాయక్ ప్రేమకథతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారట. అందుకు పూర్తిగా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పుకొచ్చారు డైరెక్టర్ వివి వినాయక్.

హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉండేలా ఓ లవ్ స్టోరీ రాసుకున్నానని.. అందుకు సుమారు రూ. 40 లక్షల బడ్జెట్ అంచనా వేసినట్లుగా చెప్పారు. ఈ ప్రేమకథకు శ్రీ అనే టైటిల్ ఫిక్స్ చేశానని.. అందులో ఇద్దరు కొత్త నటులకు అవకాశం ఉంది. అదే సమయంలో నిర్మాత బుజ్జి ద్వారా తారక్ ను కలిశాను. ఏదో విందాం లే అన్నట్టుగా నాకు ఎక్కువ సమయం లేదు. త్వరగా కథ చెప్పు అని ఎన్టీఆర్ అనగా..5 నిమిషాల్లో ఇంట్రడక్షన్ సీన్ చెప్పాను. ఆ సీన్ తారక్ కు బాగా నచ్చడంతో 2 గంటలపాటు పూర్తి కథ విన్నారు అని చెప్పారు వినాయక్.

” ఈ సినిమా మొత్తం అనుకున్న తర్వాత కొడాలి నాని వచ్చి.. మనకి లవ్ స్టోరీలు వద్దు. ఇప్పుడు ఆ డైరెక్టర్‍‏తో మనకెందుకు ? అని ఆయన ఎన్టీఆర్‏తో అన్నారు. ఆ తర్వాత నేను తారక్ చాలా సార్లు కలిశాను. ఈ విషయాన్ని నాతో చెప్పడానికి తారక్ ఇబ్బందిపడేవాడు. దీంతో నాకు మరో ఛాన్స్ ఇవ్వు. ఇంకో కథ చెప్తాను. నచ్చితే చేద్దాం అని అన్నాను. ఆయన ఓకే అనడంతో ఆది కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చడంతో ఆది సినిమా చేశాము. శ్రీ కథను రాసేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. కానీ ఆది స్టోరీని రెండు రోజుల్లోనే రాశాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత తారక్, వినాయక్ కాంబోలో వచ్చిన సాంబ, అదుర్స్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం వినాయక్ చత్రపతి హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.