
అక్కినేని ఫ్యామిలీకి జీవితాంతం గుర్తిండిపోయే ‘మనం’ సినిమా ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కే కుమార్. ఇప్పుడు ఈ దర్శకుడు అదే ఫ్యామిలీ హీరో యువసామ్రాట్ నాగ చైతన్యతో కలిసి మరోసారి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఈ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటినుంచి మూవీపై అనేక గాసిప్స్ వినిపించాయి. గతంలో విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ’13 బి’ సీక్వెల్‌గా హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రానుందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్. చైతన్యతో తీయబోతున్న సినిమా హారర్ థ్రిల్లర్ కాదని స్పష్టం చేశారు. చైతూకి తగ్గట్టుగా మంచి రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నట్టు వివరించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘లవ్‌స్టోరీ’ చేస్తున్నారు నాగచైతన్య. ఇది కంప్లీట్ అయిన తర్వాత ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్‌తో కలిసి వర్క్ చేయనున్నారు.