లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు గత సంవత్సరం జూన్ లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ఈరోజు వీరి మొదటి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అంతేకకాకుండా.. తమ కవల పిల్లలతో నయన్ సంతోషంగా ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అందులో నయన్ తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవ్వగా.. వీరిద్దరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.
“నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. అయినా నాకు నిన్ననే వివాహం అయినట్లు ఉంది. లవ్ యూ తంగమై. మన ప్రయాణాన్ని ప్రేమ, ఆశీర్వాదాలతో మొదలుపెట్టాం.మనం ఇంకా చాలా దూరం వెళ్లి కలిసి సాధించాల్సినవి ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసే ఎదుర్కొన్నాం.
నా పనిలో భాగంగా ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత నిన్నూ, పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. కుటుంబం ఇచ్చే బలం ఎవ్వురూ ఇవ్వలేరు. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్ లకు మంచి జీవితాన్ని అందించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తాను” అంటూ ఎమోషనల్ అయ్యారు. గతేడాది అక్టోబర్ నెలలో వీరికి సరోగసి పద్దతిలో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం