Sukumar -Samantha: సుకుమార్ ప్రతి సినిమాలో సమంత ఉండాల్సిందే.. ఎన్నేళ్లైనా ఆమెకు స్పెషల్ రోల్.. కారణం ఇదే..

|

Apr 03, 2024 | 4:04 PM

చరణ్, సుకుమార్ ఇద్దరి కెరీర్‏లను మలుపు తిప్పింది. కంటెంట్.. డైరెక్షన్.. నటీనటుల యాక్టింగ్ సినిమాకు హైలెట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రూ. 210 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. అలాగే ఇందులో చరణ్ నటనపై విమర్శకుల ప్రశంసలు కురిపించారు. ఇందులో చిట్టిబాబుగా రామ్ చరణ్ కనిపించగా.. రామలక్ష్మి పాత్రలో సమంత కనిపించింది. ఇద్దరు తమ పాత్రలలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో సమంతను వద్దనుకున్నారట సుకుమార్.

Sukumar -Samantha: సుకుమార్ ప్రతి సినిమాలో సమంత ఉండాల్సిందే.. ఎన్నేళ్లైనా ఆమెకు స్పెషల్ రోల్.. కారణం ఇదే..
Samantha, Sukumar
Follow us on

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని టాప్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా పరిచయమైన సుకుమార్.. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఆర్య, ఆర్య 2, జగడం, 100% లవ్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలను రూపొందించారు. 2018లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ సినిమా చరణ్, సుకుమార్ ఇద్దరి కెరీర్‏లను మలుపు తిప్పింది. కంటెంట్.. డైరెక్షన్.. నటీనటుల యాక్టింగ్ సినిమాకు హైలెట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రూ. 210 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. అలాగే ఇందులో చరణ్ నటనపై విమర్శకుల ప్రశంసలు కురిపించారు. ఇందులో చిట్టిబాబుగా రామ్ చరణ్ కనిపించగా.. రామలక్ష్మి పాత్రలో సమంత కనిపించింది. ఇద్దరు తమ పాత్రలలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో సమంతను వద్దనుకున్నారట సుకుమార్.

రంగస్థలం సినిమాకు సమంతను వద్దనుకున్న సుకుమార్.. ఆతర్వాత తన ప్రతి సినిమాలో సమంత ఉండడం ఖాయమని తెలిపారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ.. రంగస్థలం, సమంత గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ తప్ప మరొకరిని ఊహించుకోలేమని.. ఈ విషయాన్ని చెర్రీతో చాలాసార్లు చెప్పానని అన్నారు. అలాగే ఈ సినిమాకు ముందుగా సమంతు తీసుకోవాలనుకోలేదని.. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నానని అన్నారు. సినిమాలో ఇద్దరూ పెద్ద స్టార్స్ అయితే సెట్ లో మేనేజ్ చేయలేనేమో అనిపించిందని.. అందుకే రామ్ చరణ్ చాలు కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ తర్వాత పల్లెటూరి అమ్మాయి పాత్రకు సమంత సెట్ అవుతుందని తనను ఎంపిక చేశారట. షూటింగ్ సమయంలో తన నటన చూసి ఆశ్చర్యపోయానని.. ఆమె పలికించిన హావభావాలు అద్భుతం అని అన్నారు.

ఈ సినిమా తర్వాత తాను సినిమాలు తీసినంతకాలం సమంతను తీసుకుంటూనే ఉంటానని.. 30 ఏళ్లు వస్తే ఆ వయసుకు తగ్గపాత్ర.. 40 వస్తే ఆ వయసుకు తగ్గ పాత్ర.. ఇలా ప్రతిసారి ఆమెకు అవకాశమివ్వాలని అనుకున్నానని అన్నారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.