AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు జడలతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ డైరెక్టర్!

స్టార్ హీరోలు, దర్శకులకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా చాలా మంది తమ అభిమాన హీరో, డైరెక్టర్స్ ఫొటోలు చూడటానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. అయితే నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ ఫొటో ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

రెండు జడలతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ డైరెక్టర్!
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2026 | 8:49 PM

Share

సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలోకి వస్తే చాలు.. అభిమానుల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌ను అందుకున్న వారి  చిన్ననాటి ఫోటోలు బయటకు వస్తే.. అప్పుడు ఇలా ఉన్నారా.? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు. తాజాగా టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఓ దర్శకుడి చిన్ననాటి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు జడలు వేసుకుని, ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు అమ్మ చేతులతో రెండు జడలు వేయించుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్‌లో తనదైన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఆయనే శ్రీకాంత్ ఓదెల. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘దసరా’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో శ్రీకాంత్ ఓదెల పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. మాస్ ఎలిమెంట్స్, రా అండ్ రస్టిక్ టేకింగ్, పాత్రల చిత్రీకరణతో తొలి సినిమాతోనే తన ప్రత్యేకతను చాటుకున్న శ్రీకాంత్.. ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నాని పాత్రను దర్శకుడు ఏ విధంగా చూపించబోతున్నాడన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ ఓదెల తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ అరుదైన బాల్య ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన రెండు జడలతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఇవి కూడా చదవండి

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని కూడా రెండు జడలతో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ లుక్ వెనుక తన చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయని శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు. చిన్నతనంలో తనకు ఐదు, ఆరు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తన తల్లి రెండు జడలు వేసి కట్టేదని శ్రీకాంత్ తెలిపారు. అప్పట్లో తాను పెరిగి పెద్దయ్యాక ఓ కమర్షియల్ సినిమాలో హీరోను 70ఎంఎం తెరపై రెండు జడలతో ఎలా చూపించాలా అని ఊహించుకునేవాడినని చెప్పారు. ఇప్పుడు అదే ఆలోచనను ‘ది ప్యారడైజ్’లో నాని పాత్ర ద్వారా తెరపైకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తన బాల్య ఫోటోను షేర్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల.. జడల్ పాత్రకు సంబంధించిన పుట్టుక, పోరాటం కల్పితం కావచ్చని, కానీ ఆ పాత్రలో కనిపించే జడలు, రూపం మాత్రం తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి స్ఫూర్తి పొందినవేనని అన్నారు. తాను పెరుగుతున్న కొద్దీ తన బాల్యంలోని ఎన్నో జ్ఞాపకాలు ‘ది ప్యారడైజ్’లోని సన్నివేశాలపై ప్రభావం చూపాయని తెలిపారు. చిన్నప్పుడు తన తల్లి వేసిన జడల నుంచి మొదలైన ఆ ఆలోచన.. ఇప్పుడు 70ఎంఎం తెరపై నాని వంటి స్టార్ హీరోను అదే తరహా లుక్‌లో చూపించే స్థాయికి చేరుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఓదెల షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us