Khushi Movie: సమంత.. విజయ్ దేవరకొండకు డైరెక్టర్ థ్యాంక్స్.. ఖుషి సినిమా నుంచి ఆసక్తికర అప్టేట్..

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. ఇక తొందర్లోనే తర్వాతి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నట్లుగా

Khushi Movie: సమంత.. విజయ్ దేవరకొండకు డైరెక్టర్ థ్యాంక్స్.. ఖుషి సినిమా నుంచి ఆసక్తికర అప్టేట్..
Kushi 2022

Updated on: May 23, 2022 | 11:38 AM

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda).. సమంత (Samantha) జంటగా నటిస్తోన్న చిత్రం ఖుషి.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ అందమైన ప్రేమకథా చిత్రమ్ తెరకెక్కుతుంది (Khushi). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవిశంకర్, నవీన్ యూర్నేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కశ్మీర్ లో ప్రారంభమైంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు.ఈ సినిమాతోపాటు.. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగనమణ సినిమా చేస్తుండగా.. సమంత యశోదలో నటిస్తోంది. తాజాగా ఖుషి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేశారు డైరెక్టర్ శివ..

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. ఇక తొందర్లోనే తర్వాతి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేశాడు డైరెక్టర్. ఈ విషయాన్ని డైరెక్టర్ శివ తన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. సమంత, విజయ్ దేవరకొండ, వెన్నెల కిశోర్.. చిత్రయూనిట్ సభ్యులకు థ్యాంక్స్ చెప్పారు..ఈ సినిమాను డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు గతంలోనే చిత్ర బృందం ప్రకటించింది. హైదరాబాద్ షెడ్యూల్ కూడా పూర్తైన తర్వాత.. , వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి
Loading...
Unable to load recommendations.
Follow Us