Shankar: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. ఎంట్రీ ఇవ్వనున్న శంకర్ కొడుకు

ప్రస్తుతం ఇండియాలో స్టార్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరు మాత్రమే వినిపిస్తోంది. అయితే పదిహేను ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పుడు శంకర్ ఇండియా స్టార్ డైరెక్టర్.అద్భుతమైన కథలను తెరపైకి తెచ్చేవాడు. ఆయన పాటలు, మేకింగ్ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. శంకర్ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ సినిమాలతో పోల్చేవారు. ఆయన సినిమాలు ఇప్పటికే బాలీవుడ్ సినిమాలో సంచలనం సృష్టించాయి.

Shankar: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. ఎంట్రీ ఇవ్వనున్న శంకర్ కొడుకు
Shankar

Updated on: Feb 19, 2025 | 11:00 AM

ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది వారసులు అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. బ్యాగ్రౌండ్ తో సంబంధంలేకుండా తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోల కొడుకులు, కూతుర్లు ఎంట్రీ ఇచ్చారు. అలాగే కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పిల్లలు కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు మరో వారసుడు రాబోతున్నాడని తెలుస్తుంది. తాను ఎవరో కాదు టాప్ దర్శకుడు శంకర్ కుమారుడు. అవును శంకర్ కొడుకు ఇప్పుడు ఇండస్ట్రీలోకి రానున్నడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరుగాంచిన దర్శకుడు శంకర్ కుమారుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

దర్శకుడు శంకర్ తన తొలినాళ్లలో నటుడు  విజయ్ తండ్రి దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసిన శంకర్.  1993లో తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్‌మన్ చిత్రంతో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశారు. విద్యా సంస్థల్లో అవినీతి, దోపిడీలపై దృష్టి సారించిన మొదటి చిత్రం ఇది. ఈ సినిమా భారీ  విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

శంకర్ తమిళ సినిమాలోని ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ప్రశాంత్ , విక్రమ్ నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా శంకర్ చివరిగా దర్శకత్వం వహించిన భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కాగా శంకర్ చిన్న కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ ప్రస్తుతం ఆమె భైరవం అనే సినిమాలో నటిస్తుంది. అలాగే ఇప్పుడు శంకర్ కొడుకు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. శంకర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. శంకర్ కుమారుడు అరిజిత్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మద్రాసి చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి