Ram Gopal Varma: ఇంత అందంగా ఉన్న నువ్వు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నావు.. యాంకర్ పై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలిసిందే. సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. సమాజంలో నెలకొన్న పరిస్థితులపై

Ram Gopal Varma: ఇంత అందంగా ఉన్న నువ్వు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నావు.. యాంకర్ పై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma

Updated on: Feb 16, 2022 | 1:09 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి తెలిసిందే. సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. సమాజంలో నెలకొన్న పరిస్థితులపై తన స్టైల్లో రియాక్ట్ అవుతుంటారు. ఎవరి గురించి పట్టించుకోకుండా.. తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయపెడుతుంటారు. ఇక వర్మ ఇచ్చే ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా యాంకర్లపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. ఇక అమ్మాయిల విషయంలో వర్మ చేసే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ ప్రస్తుత పరిస్థితులపై రియాక్ట్ అవుతున్నారు. అలాగే తనను పాల్గొన్న టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో అక్కడున్న అమ్మాయిలను తెగ పొగిడేస్తుంటాడు. తాజాగా యాంకర్ శ్యామలపై ఓపెన్ కామెంట్స్ చేశారు ఆర్జీవి.

తాజాగా బడవ రాస్కెల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో పాల్గోన్న రామ్ గోపాల్ వర్మ.. ఆ వేడుకకు హోస్టింగ్ చేస్తున్న యాంకర్ శ్యామలను తనస్టైల్లో తెగ పొగిడేశాడు. వేదికపై వచ్చిన వెంటనే మైక్ పట్టిన ఆర్జీవి.. తాను రాస్కెల్ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే.. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. దీంతో ఆర్జీవి నోటివెంట ఆ మాటలు విన్న శ్యామల ఆశ్చర్యపోయి తెగ నవ్వేసింది. అంతేకాకుడా.. తనను తోపు, రౌడీ, గుండా ఇలా అన్ని పేర్లతో పిలిచారని.. కానీ తాను రాస్కెల్ కూడా అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. బడవ రాస్కెల్ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఇందులో పుష్ప సినిమాలో నటించిన ధనుంజయ్ హీరోగా నటించారు.

Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..

Sandhya Mukherjee: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి..

Anushka Shetty: హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..

Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!