Ram Gopal Varma: శ్రీదేవి తర్వాత ఆ హీరోయిన్‏తో సినిమా.. దెబ్బకు బ్లాక్ బస్టర్ హిట్.. రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దివంగత హీరోయిన్ శ్రీదేవికి ఆర్జీవీ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఆమెతో ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో మరో తారను తీసుకువచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Ram Gopal Varma: శ్రీదేవి తర్వాత ఆ హీరోయిన్‏తో సినిమా.. దెబ్బకు బ్లాక్ బస్టర్ హిట్.. రామ్ గోపాల్ వర్మ..
Ram Gopal Varma

Updated on: Apr 08, 2026 | 11:42 AM

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1995లో విడుదలైన రంగీలా చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. రొమాంటిక్ కామెడీ జానర్‌లో వర్మ చేసిన ఈ ప్రయత్నం విమర్శకుల ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వర్మ ఈ చిత్ర నిర్మాణం వెనుక ఉన్న విలక్షణమైన ప్రేరణలు, ఎదురైన సవాళ్లు పంచుకున్నారు. వర్మ తన కెరీర్‌లో తీసిన సినిమాలకు ఎగ్జార్సిస్ట్, గాడ్ ఫాదర్, రోమాన్సింగ్ ది స్టోన్ వంటి హాలీవుడ్ చిత్రాలు ఎలాగైతే ప్రేరణగా నిలిచాయో, రంగీలాకు కూడా పలు విభిన్న చిత్రాలు ఆయన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా, 1969లో వచ్చిన హాలీవుడ్ మ్యూజికల్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఆయన్ని అసాధారణంగా ప్రేరేపించిందని తెలిపారు. ఈ చిత్రంలో విలన్ లేకపోవడం, పాటలు సన్నివేశాల నుండి సహజంగా రావడం తనను ఆకర్షించాయని వర్మ పేర్కొన్నారు. రొమాంటిక్ చిత్రాలపై పెద్దగా ఆసక్తి లేని వర్మకు, ఈ చిత్రం రంగీలాను ఒక మ్యూజికల్‌గా తీయాలా వద్దా అనే సందేహాన్ని కలిగించిందట.

అమీర్ ఖాన్ పోషించిన మున్నా పాత్రకు తన కాలేజీ రోజుల్లో అమీర్‌పేటలో నివసించిన రమేష్ అనే బాక్సర్ నుండి ప్రేరణ పొందినట్లు వర్మ వివరించారు. రమేష్ ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు, ఆమె మరొకరిని ఇష్టపడింది. ఆ అమ్మాయిని ఆకట్టుకోవడానికి రమేష్ నైక్ షూలు, రంగుల దుస్తులు ధరించి వచ్చినప్పుడు స్నేహితులు నవ్వినా, రమేష్ ప్రయత్నంలోని చిత్తశుద్ధి వర్మను ఆకట్టుకుంది. ఈ సంఘటనే రంగీలాలో అమీర్ ఖాన్ పసుపు రంగు దుస్తులు ధరించి వచ్చే సన్నివేశానికి ప్రేరణగా నిలిచింది.

తొలుత క్షణక్షణం తర్వాత శ్రీదేవి గ్లామర్ కోణాన్ని పూర్తిస్థాయిలో చూపించాలనే ఉద్దేశ్యంతో, రంగీలా కథను ఆమెకు వినిపించారు. ఆ సమయంలో అశ్విని దత్ నిర్మాతగా ఉండగా, నాగార్జున, శ్రీదేవి, జాకీ ష్రాఫ్ పాత్రకు రజినీకాంత్ పేర్లను కూడా పరిశీలించారు. అయితే శ్రీదేవి గోవిందా గోవిందా కథను ఎంచుకోవడంతో, వర్మ రంగీలాను పక్కన పెట్టారు. గాయం సినిమా చిత్రీకరణ సమయంలో చెలి మీద చిటికెడు దయ రాదా పాట షూటింగ్ కోసం కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ రాకపోవడంతో, ఊర్మిళ మటోండ్కర్ డ్యాన్స్ దర్శకురాలు లేకుండానే అద్భుతంగా డ్యాన్స్ చేసి మెప్పించింది. ఆమె సహజమైన అందం, అభినయం చూసి, రంగీలాను ఊర్మిళతోనే చేయాలని వర్మ నిశ్చయించుకున్నారు. అలా ఊర్మిళతో వచ్చిన రంగీలా చిత్రం భారీ విజయాన్ని సాధించింది.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivas Rao: చాలా మంది నటులు ఉన్నారు.. కానీ ఆ హీరోకు ఉన్న సత్తా ఎవరికీ లేదు.. కోట శ్రీనివాస రావు..

Follow Us