ఆర్ఆర్ఆర్.. జక్కన్న సృష్టించిన ప్రభంజనం. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ గురించి తెలిసిందే. రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. 1200కు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది. అంతేకాకుండా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తెలుగు సినిమాపై డైరెక్టర్ రాజమౌళి పై ప్రశంసలు కురిపించేలా చేసింది. ఇక తాజాగా చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన 80వ జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో బెస్ట్ ఒరిజినల్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఈ అవార్డ్ వచ్చింది. దీనిని ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక విశ్వ వేదికపై గోల్డెన్ అవార్డ్ అందుకోవడంపై సినీ రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం జగన్, చంద్రబాబు నాయుడు.. మెగాస్టార్ చిరంజీవి, కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.
అవార్డ్ అందుకున్న తర్వాత జక్కన్న.. కీరవాణి సందడి చేశారు. అవార్డ్ అందుకుని వచ్చిన వారిద్దరికి కుటుంబసభ్యులు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. భారీ ఎత్తున సెలబ్రెషన్స్ జరిగాయి. రాజమౌళితోపాటు.. కీరవాణి సైతం నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఈ చిత్రంలో నాటు నాటు పాట సినీ ప్రియులను ఆకర్షించింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటకు థియేటర్లలో రచ్చ చేశారు అభిమానులు. ఇక రాజమౌళి కెరీర్ ఆరంభం నుంచి ప్రతి సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ గానూ బ్లాక్ బస్టర్ హిట్.
ఇదిలా ఉండే… ప్రపంచాన్ని ఉర్రూతలుగించిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి ఇటీవల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. కానీ ఎప్పుడూ స్టార్ట్ కాబోతుందనేది మాత్రం చెప్పలేమని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.