Krishnavamsi : రమ్యకృష్ణ, కృష్ణ వంశీ ప్రేమకు కారణం ఆ సూపర్ హిట్ సాంగ్.. అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసిన పాట అది..

టాలీవుడ్ హీరోయిన్ రమ్య కృష్ణతో తన ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడైంది. నిన్నే పెళ్లాడతా సినిమా సెట్‌లో జరిగిన తొలి పరిచయం, గులాబీ పాట పట్ల రమ్యాకున్న అభిమానం వారి బంధానికి పునాది వేసింది. ఐ లవ్ యూ అని చెప్పకుండానే, సహజసిద్ధంగా వారిద్దరూ తమ ప్రేమను గుర్తించారు. ఫోన్‌లు లేని రోజుల్లో పేజర్లు, స్నేహితులతో రాత్రి పూట తిరుగుళ్లతో వారి బంధం పటిష్టమైంది.

Krishnavamsi : రమ్యకృష్ణ, కృష్ణ వంశీ ప్రేమకు కారణం ఆ సూపర్ హిట్ సాంగ్.. అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసిన పాట అది..
Ramya Krishna, Krishna Vams

Updated on: Sep 19, 2026 | 9:00 PM

హీరోయిన్ రమ్య కృష్ణతో తన ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో డైరెక్టర్ కృష్ణ వంశీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు. ఐడ్రీమ్ సినీ వరల్డ్ ద్వారా వెలువడిన ఈ ఇంటర్వ్యూలో, వారి బంధం సహజసిద్ధంగా ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. రమ్య కృష్ణ తాను తెరకెక్కించిన “గులాబీ” పాటలను టీవీలో చూశారు. అప్పట్లో టీవీ కొత్తగా వస్తున్న రోజులు. ఆ పాటల్లో బైక్ సాంగ్ ఆమెకు బాగా నచ్చిందని చెప్పారు. ఆ సమయంలో రమ్య కృష్ణ అప్పటికే ఒక సూపర్ హీరోయిన్. ఇప్పటికీ ఆమె అదే స్థాయిలో ఒక పెద్ద స్టార్‌గా ఉన్నారు. “మా అందరికీ ఆమె పట్ల ఒక అభిమానం ఉండేది” అని వంశీ గుర్తు చేసుకున్నారు. నిన్నే పెళ్లాడతా సినిమాలోని ఒక పాత్ర కోసం మాట్లాడటానికి లక్ష్మి గారిని కలవడానికి వంశీ హైదరాబాద్ వెళ్లినప్పుడు, ఆ సెట్‌లో రమ్య కృష్ణ కూడా ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడుతూనే, చుట్టూ జనం ఉండటం వల్ల తనకు కాస్త ఆందోళనగా అనిపించిందన్నారు. అప్పుడు అక్కడే ఉన్న బ్రహ్మానందం గారిని పలకరించి, ఆయనతో మనీ మనీ, మనీ చిత్రాల గురించి సరదాగా మాట్లాడారన్నారు. ఆ తర్వాత రమ్య కృష్ణ స్వయంగా “వంశీని ఒకసారి పరిచయం చెయ్యి” అని అడిగారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఆ పరిచయం సమయంలో రమ్యాృ కృష్ణ “గులాబీ” పాట చాలా బాగుందని, చాలా ఫ్రెష్‌గా ఉందని, తెలుగులో ఇలాంటి పాట వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ప్రశంసించారన్నారు. “అప్పటికే ఆమె ఒక ఏంజిల్ లాగా అనిపించారు” అని వంశీ అన్నారు. ఆ తర్వాత రమ్య కృష్ణ “సినిమా చూశారా?” అని అడగ్గా, “లేదు, టీవీలో పాటలు మాత్రమే చూశాను” అని సమాధానం ఇచ్చానన్నారు. వెంటనే ఆమె సినిమా ఏర్పాటు చేయిస్తారా అని అడగగా, అదే రోజు సాయంత్రం సినిమా ఏర్పాటు చేసి, ఆ రాత్రి చూశానని చెప్పారు. “అక్కడి నుంచే మా బంధం స్టార్ట్ అయింది” అని వంశీ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఆ రోజుల్లో ఇప్పుడంటే ఫోన్లు లేవు. కాబట్టి, వారి బంధం మొదట పేజర్ల ద్వారా సంభాషణలతో ప్రారంభమైంది. ఆ తర్వాత రమ్య కృష్ణ షూటింగ్‌కు వెళ్లినప్పుడు తాను వెళ్లి కలవడం, రాత్రులలో తమ స్నేహితుల బృందం (నందిని, రాజా, రవి రాజా, రామ్ వంటి వారు) తో కలిసి డాబాలపైకి వెళ్లడం వంటివి తమ అనుబంధాన్ని పెంపొందించాయని తెలిపారు. వారిద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారని అడగ్గా, “మేము ఇద్దరం ప్రపోజ్ చేయలేదు. జస్ట్ హ్యాపెన్డ్ అంతే. కాలం నిర్ణయించిందా అంటే, అలా కాదు” అని వంశీ అన్నారు. ఈ అంశాన్ని తాను తన సినిమాల్లో కూడా ప్రతిబింబించడానికి ప్రయత్నిస్తానని, తన చిత్రాల్లో ఎప్పుడూ “ఐ లవ్ యూ” అని ఉండదని వివరించారు. “ఒక మూమెంట్‌లో అవుతుంది అంతే. చెప్పుకో అక్కర్లేదు. అలా జరిగింది” అని ఆయన చెప్పారు. దాదాపు 15 రోజులు లేదా ఒక నెల తర్వాత, తమకు ఒకరి పట్ల ఒకరికి భావాలు ఉన్నాయని ఇద్దరూ గ్రహించారని వంశీ స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

Loading...
Unable to load recommendations.
Follow Us