మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రతి రోజు పండగే తర్వాత వరుసగా సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇక ఇప్పుడు విరుపాక్షతో మంచి సక్సెస్ సాధించాడు ఈ యంగ్ హీరో. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సస్పెన్న్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి ఈ సినిమాకు. ఇదిలా ఉంటే సినిమా సీక్వెల్ రానుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
తాజాగా దీని పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కార్తీక్ దండు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ..విరూపాక్ష సీక్వెల్ గురించి అడగ్గా.. కార్తీక్ మాట్లాడుతూ .. ‘‘ఇప్పటికైతే ఏమి అనుకోలేదు. నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. కానీ, వెంటనే రాకపోవచ్చు’’ అని తెలిపారు.
దాంతో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. అలాగే ఈ సినిమాలో రెండు పాటలు ఉండాలి కదా.. థియేటర్ లో ఒక పాట మాత్రమే ఉంది మరోసాంగ్ లేదేంటి అని యాంకర్ ప్రశ్నించగా .. ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు ఆ సాంగ్ ను యాడ్ చేస్తాం అని అన్నారు కార్తీక్.