డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు నటుడిగానూ వెండితెరపై అలరిస్తున్నారు. కానీ ఆయన తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. దీంతో చాలా కాలం తర్వాత గతేడాది నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కుదరలేదు. తాజాగా ఇదే విషయంపై డైరెక్టర్ గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ధృవ నక్షత్రం విడుదల వాయిదా పడడం ఎంతో బాధగా ఉందని.. తనకు ఎటైనా వెళ్లిపోవాలని ఉందని అన్నారు. అనేక సంవత్సరాలుగా తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. ఈ సినిమా వల్ల తనకు మనశ్శాంతి దూరమైందని అన్నారు.
ఫిల్మ్ కంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ మాట్లాడుతూ.. “ఇది హృదయ విదారకంగా ఉంది. మనసులో అశాంతి మాత్రమే ఉంది.. మనశ్శాంతి లేదు. ఇది నిజంగా నా కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. నా పని గురించి ఎప్పుడూ ఆలోచించని నా భార్య.. 25 రోజులుగా నాతోనే ఉంటూ దీని గురించే ఆలోచిస్తుంది. ఆమె ఈ సినిమాకు వచ్చిన అడ్డంకుల గురించి చూస్తుంది. నాకు ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపిస్తుంది.. కానీ కొత్త పెట్టుబడిదారులకు జవాబుదారీగా ఉండడం వల్ల కుదరలేదు. ” అని అన్నారు.
2016లోనే ‘ధృవ నక్షత్రం’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈసినిమాను 2017లో విడుదల చేయనుకున్నారు. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఈ మూవీ వాయిదా పడింది. ఇక చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఈ సినిమాను గతేడాది నవంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ విడుదల చేయడం కుదరలేదు. ఇందులో చియాన్ విక్రమ్ హీరోగా నటించారు. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్ల జాబితాలోకి వారిని చేర్చాల్సి వచ్చిందని.. అది పీడకలగా అనిపించిందని.. కానీ, మరికొద్ది రోజుల్లో తన సినిమా (జాషువా) ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అందుకోసం ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు. ‘జాషువా’ కంటే ముందే చియాన్ విక్రమ్ ‘ధృవ నచ్చతిరమ్’ విడుదల చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జాషువా సినిమా మార్చి 1న రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.