Tollywood: ఆ స్టార్ నటుడికి ఈగో ఎక్కువా.? ఓపెన్‌గా నిజం చెప్పేసిన డైరెక్టర్

దర్శకుడు చంద్ర మహేష్ వడ్డే నవీన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే తరుణ్ సినిమా ఆగిపోవడానికి కారణం వివరించారు. శ్రీహరి గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.

Tollywood: ఆ స్టార్ నటుడికి ఈగో ఎక్కువా.? ఓపెన్‌గా నిజం చెప్పేసిన డైరెక్టర్
Chandra Mahesh

Updated on: Feb 21, 2026 | 1:07 PM

దర్శకుడు చంద్ర మహేష్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోలు వడ్డే నవీన్, శ్రీహరిలతో తన అనుభవాలను పంచుకున్నారు. వడ్డే నవీన్‌పై ఇండస్ట్రీలో నెగటివ్ ప్రచారం జరిగిందని.. ఇండస్ట్రీలో అతడొక అహంభావి అని అనుకుంటున్నారని.. కానీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన ఎంతో సౌమ్యుడని, జెంటిల్‌మెన్ అని మహేష్ వెల్లడించారు. అలాగే, తరుణ్‌తో అనుకున్న ఒక సినిమా రెమ్యూనరేషన్ సమస్యల కారణంగా ఆగిపోయిందని పేర్కొన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాలో శ్రీహరికి అవకాశం రావడానికి తాను ఎలా సహాయపడ్డానో వివరించారు చంద్ర మహేష్. కేవలం ఒక గంటలోనే ముస్లిం గెటప్‌లో వచ్చి శ్రీహరి.. రామానాయుడును ఆశ్చర్యపరిచారని, ఆ పాత్రకు నంది అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

శ్రీహరిలో ఉన్న మంచి మనసు, కష్టాల్లో ఉన్నవారికి రహస్యంగా సహాయం చేసే గుణం, టాలెంట్‌ను ప్రోత్సహించే స్వభావాన్ని చంద్ర మహేష్ కొనియాడారు. శ్రీహరి కేవలం ఫైట్లు, డైలాగులు అని విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో, తన పరిచయం తర్వాతే ఆయన కెరీర్ మలుపు తిరిగిందని మహేష్ పేర్కొన్నారు. శివయ్య సినిమా తర్వాత శ్రీహరికి హీరోగా అవకాశం రావడంతో, ఆయన తన వద్దకు వచ్చి డైరెక్ట్ చేయమని కోరినప్పుడు, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే తన మొదటి సినిమా చేయాలనే తన కలను వివరించి నిరాకరించారని మహేష్ తెలిపారు. కే.ఎస్. నాగేశ్వర్ రావు దర్శకత్వంలో పోలీస్, దేవా, సాంబయ్య లాంటి హిట్‌ చిత్రాలతో శ్రీహరి మాస్ హీరోగా స్థిరపడ్డారని పేర్కొన్నారు. తన ప్రేయసి రావే సినిమాలో హీరోగా ఉన్న శ్రీహరి చిన్న విలన్ క్యారెక్టర్ చేయమని కోరగా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన కోసం నటించారని మహేష్ గుర్తు చేసుకున్నారు. శ్రీహరి చాలా మంచి మనిషి అని, కష్టాల్లో ఉన్న లైట్‌మెన్, ప్రొడక్షన్ బాయ్ నుంచి హీరోల వరకు ఎవరికైనా సహాయం చేసేవాడని, గుప్తదానాలు చేసేవాడని, ఎదుటివారి ఆత్మగౌరవాన్ని కాపాడేవాడని ప్రశంసించారు.

Follow Us