Uppena Movie : ‘ఉప్పెన’ సినిమాలో మొదటిగా ఆ హీరోని అనుకున్నారట.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయంఅయిన సినిమా ‘ఉప్పెన’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుదర్శకుడిగా పరిచయం అయ్యారు.

Uppena Movie : ఉప్పెన సినిమాలో మొదటిగా ఆ హీరోని  అనుకున్నారట.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు

Updated on: Feb 13, 2021 | 2:03 AM

Uppena Movie : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయంఅయిన సినిమా ‘ఉప్పెన’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుదర్శకుడిగా పరిచయం అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఈ చిత్రం లో హీరో హీరోయిన్ పాత్రల తో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా విజయ్ సేతుపతి పాత్ర పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో మొదటిగా హీరోగా వైష్ణవ్ ను అనుకోలేదట.. ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. కథ రాసుకునే సమయంలో ఎక్కడో ఓ దగ్గర హీరో విజయ్ దేవరకొండను అనుకున్నప్పటికి.. కథ కంప్లీట్ అయ్యాక వైష్ణవ్ తేజ్ ఒక్కడినే ఫైనల్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉప్పెన మంచి టాక్ తో భారీ ఓపెనింగ్స్ అందుకున్నట్లు టాక్. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో హీరోయిన్ కృతిశెట్టి దొరికింది. అలాగే మక్కల్ సెల్వన్ ఉప్పెనలో విలన్ క్యారెక్టర్ పోషించి సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘వరుడు కావలెను’ నుంచి అందమైన ప్రేమ గీతం.. మరోసారి మెస్మరైజ్ చేసిన సింగర్ సిద్ శ్రీరామ్

Loading...
Unable to load recommendations.
Follow Us