Ram Charan: జోరుగా రామ్ చరణ్ నయా మూవీ ప్రీ ప్రొడక్షన్.. కొత్త ఆఫీస్ ప్రారంభించిన బుచ్చిబాబు

|

Aug 28, 2023 | 8:29 AM

గేమ్ చెంజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని టాక్.

Ram Charan: జోరుగా రామ్ చరణ్ నయా మూవీ ప్రీ ప్రొడక్షన్.. కొత్త ఆఫీస్ ప్రారంభించిన బుచ్చిబాబు
Ram Charan 16
Follow us on

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంచలన విజయం అందుకున్నారు. పాన్ ఇండియా స్టార్ గా చరణ్ క్రేజ్ పెరిగిపోయింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. గేమ్ చెంజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని టాక్.

ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు, సుకుమార్ శిష్యుడిగా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా జాతీయ అవార్డు కూడా అందుకుంది ఈ సినిమా.

రామ్ చరణ్ 16 కోసం ఆఫీసు ప్రారంభించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ 16 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.