Check Movie: ‘చెక్‌ మూవీ ఐడియా పదిహేను ఏళ్లుగా నాలో ఉంది’.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన దర్శకుడు..

|

Feb 21, 2021 | 9:49 PM

Check movie pre-release event : నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో 'చెక్‌' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ..

Check Movie: చెక్‌ మూవీ ఐడియా పదిహేను ఏళ్లుగా నాలో ఉంది.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన దర్శకుడు..
సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని.. ఓవరాల్‌గా సినిమా హిట్ అని ప్రేక్షకుల మాట
Follow us on

Check movie pre-release event : నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ‘చెక్‌’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో నితిన్‌ జీనియస్‌ ఖైదీగా నటిస్తున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కథ చెస్‌ నేపథ్యంలో సాగనుంది.

తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘చెక్‌’ సినిమా ఐడియాలో ఇప్పటికిప్పుడే వచ్చింది కాదని.. తనలో ఈ ఆలోచనల పదిహేను ఏళ్లుగా ఉందని, ఆ ఆలోచన రకరకాలుగా మారి ‘చెక్‌’లా తయారైందని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన మాట్లాడుతూ చెక్‌ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందని, నేను ఇప్పటి వరకు తీసిన మిగిలిన సినిమాలు ఏమైనా నిరుత్సాహపరిచి ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం అలా చేయదు. ఫిబ్రవరి 26న ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ‘చెక్‌’ చిత్ర యూనిట్‌ ప్రచారంలో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేడుకను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, వరుణ్‌ తేజ్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ‘చెక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లైవ్‌ను ఇక్కడ చూడండి.

Also Read: Surekha Vani: తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన నటి సురేఖ వాణి.. మరోసారి ఏడడుగులు వేయడం..