
‘అపరిచితుడు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విక్రమ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘ఐ’. తెలుగులో ‘మనోహరుడు’గా రిలీజైంది. 2015లో రిలీజైన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. శంకర్ రేంజ్ లో లేనప్పటికీ చాలా మందికి బాగా నచ్చింది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ నటన వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు.అలాగే అమీజాక్సన్ కూడా ఎంతో అందంగా కనిపించింది. కాగా ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. మలయాళం స్టార్ నటుడు సురేష్ గోపీ ఇందులో మెయిన్ విలన్ గా నటించడం విశేషం. వీరితో పాటు సంతానం, జీ రామ్ కుమార్, ఉపేన్ పటేల్, యోగి బాబు, ఆర్. శరత్ కుమార్ తదితరులు ఐ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఇదే విక్రమ్ సినిమాలో ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. ఈ రోల్ ప్లే చేసినది ఓస్మా జాస్మిన్. అసలు పేరు ఓజాస్ రజనీ. బాలీవుడ్‌లో తోపు మేకప్ ఆర్టిస్టు గా రజనీకి మంచి గుర్తింపు ఉంది.
హిందీ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరో, హీరోయిన్లకు ఓజాస్ రజనీ మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు నీతా అంబానీ వంటి టాప్ రిచెస్ట్ బిజినెస్ వుమెన్స్ కు కూడా రజనీ మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలకు కూడా రజనీ పనిచేశారు. శంకర్ తెరకెక్కించిన భారతీయుడు, అపరిచితుడు, రోబో వంటి సినిమాలకు రజనీ మేకప్ ఆర్టిస్టుగా పనిచేశారు.
ఈ క్రమంలోనే విక్రమ్ ‘ఐ’ సినిమా కోసం కూడా రజనీని పిలిపించారు శంకర్. సినిమాలో కీలకమైన మేకప్ ఆర్టిస్టు రోల్‌కు రజనీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని.. కథ చెప్పి ఒప్పించాడు. అలా మొత్తానికి రజనీ ఆ పాత్రలో జీవించేశారు. సిల్వర్ స్క్రీన్‌పై రజనీ చూపించిన వేరియేషన్, విలనిజం నెక్స్ట్ లెవల్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఐ తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదీ మేకప్ ఆర్టిస్. ఎలాంటి టీవీ షోలోనూ కనిపించలేదు. అయితే ఇప్పుడు ఫుల్ టైమ్ మేకప్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా ఉంటున్నారు రజనీ. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల నుంచి బడా బడా బిజినెస్ మ్యాన్‌ల వరకు చాలా మందికి మేకప్ ఆర్టిస్టుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోన్న ఆమె ఇంట్రెస్టింగ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. అలా లేటెస్ట్ గా రజనీ షేర్ చేసిన కొన్ని ఫొటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ బాగా మారిపోయారు రజనీ. మొదట చాలా మంది తనను చూసి గుర్తు పట్టలేకపోయారు కూడా. ప్రస్తుతం ఓజాస్ రజనీకి సంబంధించి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.