Guntur Kaaram Trailer: గురూజీ పెద్ద ప్లానే వేశారు.. గుంటూరు కారం ట్రైలర్‌లో ఇవి గమనించారా..?

|

Jan 08, 2024 | 7:25 AM

సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ను ప్రేక్షకుల ,ముందుకు తీసుకురానున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన అతడు , ఖలేజా సినిమాలకంటే భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గుంటూరు కారం సినిమా ట్రైలర్ నిన్న (జనవరి 7)న రిలీజ్ అయ్యింది.

Guntur Kaaram Trailer: గురూజీ పెద్ద ప్లానే వేశారు.. గుంటూరు కారం ట్రైలర్‌లో ఇవి గమనించారా..?
Guntur Kaaram
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చాలా కాలం తర్వాత మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ను ప్రేక్షకుల ,ముందుకు తీసుకురానున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన అతడు , ఖలేజా సినిమాలకంటే భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గుంటూరు కారం సినిమా ట్రైలర్ నిన్న (జనవరి 7)న రిలీజ్ అయ్యింది. అందరు అనుకున్నట్టే త్రివిక్రమ్ మార్క్ లో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

ఇక ట్రైలర్ లో మహేష్ అభిమానులకు కావాల్సిన మసాలా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చూపించారు. ఈ ట్రైలర్ ఇప్పుడు సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు స్టైల్, డైలాగ్ డెలివరీ , యాటిట్యూడ్ ఫ్యాన్స్ ను ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ను డిఫరెంట్ గా డిజన్ చేశారు త్రివిక్రమ్. చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘చూడంగానే మజా వచ్చిందా’, ‘హార్ట్‌ బీట్‌ పెరిగిందా’, ‘ఈల వేయాలనిపించిందా..’, ‘ఆట చూస్తావా’..? అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే ఈ ట్రైలర్ మొదట్లో ఓ ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ రమ్యకృష్ణను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్టు చూపించారు. ఆ జర్నలిస్ట్ వాయిస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గొంతులా ఉంది. ఆయన ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందనిపిస్తుంది. అలాగే ట్రైలర్ ప్రారంభంలో మహేష్ చిన్నప్పుడు కంట్లో నిప్పు రవ్వ పడుతున్నట్టు చూపించారు. బహుశా మహేష్ కంటికి ఏదైనా ప్రాబ్లమ్ ఉందని చూపిస్తారేమో.. ఆట చూస్తావా..? అనే డైలాగ్ చెప్పేటప్పుడు మహేష్ ఒక కన్ను మూసి చూస్తాడు. అలాగే హీరోయిన్ ను చూసేటప్పుడు కూడా ఒక కన్ను మూసి చూస్తుంటాడు. ఇదిలా ఉంటే నిర్మాత నాగవంశీ ఇద్దరు సూపర్ స్టార్లు ఫైట్ చేస్తున్న ఫీల్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అని హింట్ ఇచ్చారు. ట్రైలర్ లో ఎక్కడ ఏం చూపించలేదు. మరి సినిమాలో ఏదైనా సర్ ప్రైజ్ ఎంట్రీ ఉంటుందేమో చూడాలి. జనవరి 12న గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.