H. D. Kumaraswamy: ఈ కేంద్రమంత్రి భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. చూస్తే అవాక్ అవుతారు

|

Jun 16, 2024 | 7:58 AM

సొంత పార్టీ పెట్టి.. ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనే హరదనహళ్ళి దేవెగౌడ కుమారస్వామి. కన్నడ రాజకీయాల్లో ఆయన తెలియని వారు ఉండరు. అయితే ఈయన సతీమణి టాలీవుడ్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. అందం అభినయం కలబోసినా ఆమె తన సినిమాలతో మెప్పించారు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

H. D. Kumaraswamy: ఈ కేంద్రమంత్రి భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. చూస్తే అవాక్ అవుతారు
Kumara Swamy
Follow us on

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది వ్యవరవేత్తలను పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొంతమంది హీరోలను, నిర్మాతలను పెళ్లి చేసుకున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయనాయకులను వివాహం చేసుకున్నారు. అలాగే ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఓ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకుంది. ఆయన ఏ చిన్న రాజకీయనాయకుడో కాదు.. సొంత పార్టీ పెట్టి.. ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనే హరదనహళ్ళి దేవెగౌడ కుమారస్వామి. కన్నడ రాజకీయాల్లో ఆయన తెలియని వారు ఉండరు. అయితే ఈయన సతీమణి టాలీవుడ్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. అందం అభినయం కలబోసినా ఆమె తన సినిమాలతో మెప్పించారు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

కుమార స్వామి భార్య పేరు రాధిక కుమారస్వామి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధికా .. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించింది ఈ అమ్మడు. 2000 ఏడాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇక  రాధికా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమా చేసే సమయంలో ఆమె 9వ తరగతి చదువుతుంది. కన్నడ బాషాలో వరుసగా సినిమాలు చేసిన ఆమె తమిళ్ లోనూ సినిమాలు చేసింది. యార్కాయి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో దివంగత నటుడు తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమాలో నటించింది. 2004లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో రాధికా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఆతర్వాత అవతారం అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. 2018 వరకు సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే రాధికా రెండు సినిమాలను నిర్మించింది కూడా.. కాగా కుమారస్వామిని రాధికా వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు అనిత కుమారస్వామితో వివాహం అయ్యింది. అటు రాధికాకు కూడా అది రెండో వివాహమే.. అంతకు ముందు ఆమె రతన్ కుమార్ ను వివాహం చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.