
Happy birthday Chiranjeevi: అన్నయ్య అని తెలుగు ప్రజలు మద్దుగా పిలుచుకునే వ్యక్తి చిరంజీవి. తనని తాను మెగాస్టార్‌గా మలుచుకున్న అల్టిమేట్ వ్యక్తి ఆయన. అన్న ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమాను ఏకచత్రాధిపత్యంగా ఏలారు మెగాస్టార్. కష్టపడే తత్వం.. ఎప్పుడూ నేర్చుకునే స్వభావం.. వృత్తి పట్ల డెడికేషన్.. మొక్కవోని ఆత్మవిశ్వాసం చిరంజీవిని ఎప్పుడూ పైన ఉండేలా చేశాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఎదగాలనుకునే వారికి చిరు ఇన్స్పిరేషన్. మెగాస్టార్.. డ్యాన్స్ చేస్తే సీటీ కొట్టాల్సిందే. కామెడీ చేస్తే నవ్వులు పండాల్సిందే. ఫైట్ చేస్తే ఫిదా అవ్వాల్సిందే. వాట్ నాట్.. చిరు ఈజ్ కంప్లీట్ స్టార్. నేడు అన్నయ్య బర్త్ డే. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికీ బాస్ అంటే అదే మాస్.. అదే గ్రేస్. కెరీర్ ప్రారంభంలో చిన్న.. చిన్న పాత్రలు చేశారు మెగాస్టార్. ఆ తర్వాత విలన్ వేశాలు వేసి.. హీరోగా మారారు. 150పై చిలుకు చిత్రాలతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు. అయితే చిరు కెరీర్ స్టార్టింగ్‌లో ఓ సీరియల్‌లో కూడా నటించారని మీకు తెలుసా..?. అవును పరిశోధనలో ఈ విషయం తెలిసింది. హిందీ సీరియల్ రజినిలో నటించి.. స్మాల్ స్క్రీన్‌పై మెరిశారు. అయితే అది అతిథి పాత్ర మాత్రమే. ఒక్క ఎపిసోడ్‌కు మాత్రమే పరిమితం. ఆ తర్వాత పలు సినిమాల్లో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ రావడంతో.. అలా ముందుకు వెళ్లారు.