మహేష్ బాబు సినిమాలోని ఒక పాటను నలుగురు స్టార్ సింగర్ ఆలపించారని మీకు తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు అన్ని సినిమాల్లోని పాటలు దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. మహేష్ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. ఇక మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మహేష్ బాబు సినిమాలోని ఒక పాటను నలుగురు స్టార్ సింగర్ ఆలపించారని మీకు తెలుసా..?
Mahesh Babu Photo

Updated on: Aug 18, 2023 | 1:23 PM

చాలా సినిమాలకు సంగీతం పాణం పోస్తుంది. సినిమా కథ కొంచం అటు ఇటుగా ఉన్నా మ్యూజిక్ తో కవర్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఇక కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాకూడా పాటలు మాత్రం హిట్ అవుతూ ఉంటాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అన్ని సినిమాల్లోని పాటలు దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. మహేష్ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. ఇక మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. మొదటిగా వచ్చిన ఒక్కడు సినిమా సంచలన విజయం అందుకుంది. ఆతర్వాత వచ్చిన అర్జున్ సినిమా కూడా పర్లేదు అనిపించుకుంది. సైనికుడు సినిమా మాత్రం నిరాశపరిచింది. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ నటన, ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా అందాల భామ త్రిష నటించిన విషయం తెలిసిందే.

సైనికుడు సినిమాకు హరీష్ జై రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఓ పాటను ఏకంగా నలుగురు సింగర్స్ ఆలపించారు. సాధారణంగా ఒక పాటను ఇద్దరు పడతారు. లేదా ముగ్గురు కలిసి పాడుతారు. కానీ ఈసాంగ్ ను ఏకంగా నలుగురు స్టార్ సింగర్స్ ఆలపించారు. ఆ పాట ఎదో తెలుసా..

సైనికుడు సినిమాలో ఓరుగల్లుకే పిల్ల అనే సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ ను నలుగురు ఆలపించారు. సింగర్ కార్తీక్, మాలతీ, హరిణి, కారుణ్య కలిసి ఈ సాంగ్ ను ఆలపించారు. ఒకొక్కరు ఒకొక్క పోర్షన్ ను ఆలపించారు. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.

సింగర్ కార్తీక్ ఇన్ స్టా గ్రామ్..

సింగర్ హరిణి ఇన్ స్టా గ్రామ్

సింగర్ కారుణ్య ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.