Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

స్టార్ నటుడి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరీర్ ప్రారంభంలో ప్రేమకథా చిత్రాలు చేసి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయడీ హ్యాండ్సమ్ హీరో. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ హీరో పలు ఆటుపోట్లనే ఎదుర్కొన్నాడు.

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్
Tollywood Actor

Updated on: May 31, 2025 | 4:25 PM

పై ఫొటోలో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఒకప్పుడు దక్షిణాదిలో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో ఒకడు. అమ్మాయిలైతే పడి చచ్చేవారు. ఒక స్టార్ నటుడి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడీ యాక్టర్. 17 ఏళ్లకే కెమెరా ముందుకు వచ్చిన అతను కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాల్లో నటించాడు. తద్వారా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దేశం గర్వించదగ్గ దర్శకులైన మణిరత్నం, శంకర్ సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. సూపర్ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకున్నాడు. అప్పట్లో ఇతని జోరు చూస్తే సినిమా ఇండస్ట్రీని ఏలుతాడని భావించారు చాలామంది. అయితే క్రమంగా ఈ హీరో సినిమాలు బోల్తా పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భార్యతో విడాకులు తీసుకుని విడిపోయాడు. అయితే సినిమా ఛాన్సులు తగ్గినా బిజినెస్ రంగంలో దూసుకుపోయాడీ హీరో. భారతదేశంలోనే అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్ గా ఉన్నాడీ హ్యాండ్సమ్ నటుడు. అతను మరెవరో కాదు జీన్స్ హీరో ప్రశాంత్.

నటుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ప్రశాంత్ సత్తా చాటాడు. అలా కొన్నేళ్ల క్రితం చెన్నైలోని పానగల్ పార్క్ లో ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ పేరుతో ఓ జ్యూయెలరీ మాల్ ను కట్టించాడు. దాదాపు 10 అంతస్తులతో 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ ఉంది. భారత దేశంలోని ప్రముఖ నగల బ్రాండ్‌లకు ఇది నిలయం. అంతేకాదు ఫుడ్ కోర్ట్, ఏటీఎంలు, విశాలమైన పార్కింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మాల్ నిర్వహణలో ప్రశాంత్ సోదరి, నగల డిజైనర్ ప్రీతి త్యాగరాజన్ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇవి కూడా చదవండి

నటుడు ప్రశాంత్ ఇన్ స్టాగ్రామ్  వీడియో..

కాగా అంధాదూన్ రీమేక్ లో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్. ఆ తర్వాత దళపతి విజయ్ గోట్ లో ఓ కీలక పాత్ర పోషించాడు. అతని తర్వాతి సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

Akhil Akkineni: అక్కినేని ఇంట మరో శుభకార్యం.. అఖిల్- జైనాబ్‌ల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వేదిక ఎక్కడంటే?

Tollywood: ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ 4వేల కోట్ల యువరాణి.. ఈ రిచెస్ట్ హీరోయిన్ కూతురు ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Pavala Shyamala: ‘సాయం కోసం వారి దగ్గరికి వెళ్తే గెంటేశారు.. ఆ హీరో మాత్రమే ఆదుకున్నారు’.. దీన స్థితిలో పావలా శ్యామల