Dhurandhar 2: ‘ధురంధర్’ సినిమాను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు.. స్వయంగా చెప్పిన డైరెక్టర్

రణ్ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. మార్చి 19న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా రూ. 2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

Dhurandhar 2: ధురంధర్ సినిమాను రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోలు.. స్వయంగా చెప్పిన డైరెక్టర్
Dhurandhar The Revenge

Updated on: Apr 05, 2026 | 9:56 AM

రణ్ వీర్ సింగ్ – ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి భాగం 1380 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) ఏకంగా 1600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దాటి , 2000 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. ధురంధర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం ఇందులో నటించిన యాక్టర్సే. హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు మిగతా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. హీరోయిన్ సారా అర్జున్, విలన్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తదితర పాత్రలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే ధురంధర్ 2 లో పెద్దగా కనిపించలేదు కానీ ధురంధర్ మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా బాగా హైలెట్ అయ్యాడు. రెహమాన్ డెకాయిట్ పాత్రలో అదరగొట్టాడు. అక్షయ్‌ హావభావాలు, మేనరిజం, డ్యాన్స్‌.. ఇలా అన్నీ సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ విలన్‌ పాత్ర కోసం అక్షయ్‌ ఖన్నా మొదటి ఛాయిస్ కాదట. అతని కంటే ముందు ధురంధర్ టీమ్ పలువురు నటీనటులను ఈ రోల్ కోసం సంప్రదించారట. అయితే వారు నిరభ్యంతరంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని స్వయంగా ధురంధర్ కాస్టింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ చాబ్రానే వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను ధురంధర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘ధురంధర్ సినిమాలో రెహ్మాన్ డెకాయిట్ పాత్రని ముగ్గురు టాప్ నటులు రిజెక్ట్ రిజెక్ట్ చేశారు. అందులో ఒకరు సౌత్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక స్టార్ హీరో కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరు బాలీవుడ్ కి చెందిన నటులు. వారి పేర్లు ఇప్పుడు బయటకు చెప్పలేను కానీ ఆ పాత్రను తిరస్కరించినందుకు వాళ్లు కచ్చితంగా బాధపడే ఉంటారు. ధురంధర్‌లో నటించేందుకు మొదట అర్జున్‌ రాంపాల్‌, సంజయ్‌ దత్‌, అక్షయ్‌ ఖన్నా కూడా కాస్త తటపటాయించారు. ఆర్‌.మాధవన్‌ ఒక్కరే వెంటనే ఓకే చెప్పారు. మిగతా అందరూ కాస్త సమయం తీసుకున్నారు. దర్శకుడు ఆదిత్య, నేను.. ఇలా ఎంతోమంది స్టార్స్‌ను ఈ సినిమాలో భాగం చేయాలని ముందుగానే అనుకోలేదు. కానీ, అలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు’ అని చెప్పుకొచ్చాడు ముకేశ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us