Tollywood: పెళ్లి రోజునే.. రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ స్టార్ నటి.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటి శుభవార్త చెప్పింది. తమ పెళ్లి రోజే తనకు పండంటి బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టిందీ అందాల తార. దీంతో పలువురు ప్రముఖులు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tollywood: పెళ్లి రోజునే.. రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ స్టార్ నటి.. ఫొటోస్ వైరల్
Actress Chaithra Rai

Updated on: Dec 26, 2025 | 3:30 PM

టాలీవుడ్ ప్రముఖ నటి గుడ్ న్యూస్ చెప్పింది. తాను మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు తమ చిట్టి బుజ్జాయి చేతి ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘మా జీవితాల్లో మరో అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభించాయి. మా కుటుంబంలోకి మరో పండంటి మహాలక్ష్మి అడుగుపెట్టింది. మా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది. మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! మేమిద్దరం ఇప్పుడు నలుగురమయ్యాం. ఈ పెళ్లిరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలా అభిమానుల అభినందనల వర్షంలో మునిగితేలుతోన్న ఆ అందాల తార మరెవరో కాదు చైత్ర రాయ్. ఈ పేరు చెబితే చాలామంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ఎన్టీఆర్ దేవర సినిమాలో విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్యగా కనిపించిన నటి అంటే ఇట్టే గుర్తు పడతారు.

 

ఇవి కూడా చదవండి

కన్నడ నాటకు చెందిన చైత్ర రాయ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా సీరియల్స్ చూసే వారిలో చాలా మందికి ఈ నటి ఫేవరెట్. అష్టాచమ్మా సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛైత్ర. ఆ తర్వాత అత్తో అత్తమ్మ కూతురో, దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించింది. తన అభినయంతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. సీరియల్స్ తో పాటు దేవర లాంటి సినిమాల్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది చైత్ర.

చైత్ర రాయ్ ఎమోషనల్ పోస్ట్..

చైత్ర వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2016లో ఇంజనీర్‌ ప్రసన్న శెట్టిని పెళ్లి చేసుకుందీ అందాల తార. ఈ దంపతులకు 2021లో కూతురు నిష్క శెట్టి పుట్టింది. ఇప్పుడు మరో చిట్టి పాపను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్.

సీమంతం వేడుకలో భర్తతో చైత్ర రాయ్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.