Dacoit Movie: ‘డెకాయిట్’ నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుందా? తప్పించారా? అసలు విషయం చెప్పిన నిర్మాత సుప్రియ

అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రుతి హాసన్ ను తీసుకున్నారు. ఆమెపై చాలా సీన్స్ షూట్ చేశారు. కానీ..

Dacoit Movie: డెకాయిట్ నుంచి శ్రుతి హాసన్‌ తప్పుకుందా? తప్పించారా? అసలు విషయం చెప్పిన నిర్మాత సుప్రియ
Dacoit Movie

Updated on: Apr 20, 2026 | 10:00 PM

అడివి శేష్ హీరోగా లేటెస్ట్ సినిమా ‘డెకాయిట్’. షానీల్ డియో తెరకెక్కించిన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.50 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమాలో అడివి శేష్ నటనతో పాటు మృణాళ్ యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. శేష్ కు పోటీగా మృణాళ్ నటించిందని, కొన్ని సీన్లలో హీరోనే ఆమె డామినేట్ చేసిందని రివ్యూలు వచ్చాయి. మొత్తానికి డెకాయిట్ సినిమాతో మృణాళ్ ఠాకూర్ కు తెలుగులో మరో మంచి సాలిడ్ హిట్ లభించింది. అయితే ఈ సినిమాకు మొదట హీరోయిన్ గా మృణాళ్ ఠాకూర్ కాదన్న సంగతి తెలిసిందే. ఆమె కంటే ముందు శ్రుతి హాసన్ ను కథానాయికగా తీసుకున్నారు. ఆమెపై చాలా సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. చివరకు ఒక గ్లింప్స్ లోనూ శ్రుతి సీన్లను చూపించారు. కానీ ఏమైంతో తెలియదు కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్టులోకి మృణాళ్ ఠాకూర్ చేరింది. దీంతో ఈ సినిమా నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ ని త‌ప్పించారా? లేదా ఆమెనే తప్పకుందా? అనేదానిపై చాలా కాలంగా సోషల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై నిర్మాత సుప్రియ యార్లగడ్డ స్పందించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుప్రియ శ్రుతి హాసన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. శ్రుతి హాసన్ కంటే ముందే రెండేళ్ల క్రితం మృణాల్ ఠాకూర్ ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నాం. అయితే మృణాల్ కి కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తింది. ఆ త‌ర్వాత శ్రుతి హాసన్ మా ప్రాజెక్టులోకి చేరింది. అయినా సినిమా ఆల‌స్య‌మైంది. చివ‌రికి మృణాల్ మా టీమ్ తో చేరింది. ఆమె డెకాయిట్ టీమ్ తో చేర‌డం డెస్టినీ అని అందరూ నవ్వుకున్నాం’ అని చెప్పుకొచ్చింది సుప్రియ. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

50 కోట్ల క్లబ్ లో డెకాయిట్ సినిమా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us