Veera Simha Reddy: మరోసారి విశ్వరూపం చూపించనున్న బాలయ్య.. వీరసింహా రెడ్డి మూవీలో ఇలా..

|

Nov 19, 2022 | 2:41 PM

అఖండ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే మరో కమర్షియల్ ఎంటర్టైనర్‌ను పట్టాలెక్కించారు నందమూరి నటసింహం. కమర్షియల్ సినిమా స్పెషలిస్ట్‌ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు.

Veera Simha Reddy: మరోసారి విశ్వరూపం చూపించనున్న బాలయ్య.. వీరసింహా రెడ్డి మూవీలో ఇలా..
Balakrishna
Follow us on

నందమూరి అభిమానులకు అసలు పండుగ రాబోతుంది. అఖండ తరువాత స్కై హైలో ఉన్న ఫ్యాన్స్‌కి ఇప్పుడు మరింత జోష్ ఇచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అఖండ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే మరో కమర్షియల్ ఎంటర్టైనర్‌ను పట్టాలెక్కించారు నందమూరి నటసింహం. కమర్షియల్ సినిమా స్పెషలిస్ట్‌ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్‌ టీజర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య విశ్వరూపం చూపించబోతున్నారన్న అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

రీసెంట్‌గా టైటిల్‌ రివీల్ చేసిన మేకర్స్‌… వింటేజ్ బాలయ్యను చూడబోతున్నారన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు కంటెంట్ విషయంలోనూ బాలయ్య ఫ్యాన్స్‌కు పునాకాలే అన్నది లేటెస్ట్ అప్‌డేట్‌. పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య విశ్వరూపం చూపించబోతున్నారంటూ ఊరిస్తున్నారు మేకర్స్.

ప్రజెంట్ చిత్రీకరణ జరుపుకుంటున్న వీర సింహారెడ్డి మూవీలో ఏకంగా 11 యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయన్నది నయా అప్‌డేట్‌. పక్కా బాలయ్య మార్క్ యాక్షన్‌ స్టంట్స్‌ ఫ్యాన్స్‌కు గూజ్‌ బంప్స్ తెప్పించబోతున్నాయట. మామూలుగా బాలయ్య సినిమా అంటే యాక్షన్‌ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెవ్వర్ బిఫోర్ అన్న క్లారిటీ రావటంతో వీర సింహారెడ్డి మీద అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి