మెగా హీరోకు జోడీగా కొరియన్ బ్యూటీ.. చరణ్ కోసం భారీ ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ?

|

Feb 24, 2021 | 2:24 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోపాటే చిరంజీవి.. కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న

మెగా హీరోకు జోడీగా కొరియన్ బ్యూటీ.. చరణ్ కోసం భారీ ప్లాన్ చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ?
Follow us on

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోపాటే చిరంజీవి.. కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ‘ఆచార్య’ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్న చరణ్. ఈ సినిమాల తర్వాత చరణ్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వత ఈ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరో రాంచరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి భారీగా ఊహించుకుంటున్నారు చరణ్ అభిమానులు. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మార్క్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ విభిన్న పాత్రలో నటించనున్నట్లుగా సమాచారం. అయితే ఆరంభం నుంచి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. చరణ్ సరసన ఈ మూవీవో సౌత్ కొరియాకు చెంది బేసుజీ నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమా హీరోయిన్ తనే అంటూ ప్రచారం నడుస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్‏తో ఈ మూవీని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

also Read:

నిర్మాతలకు షాక్ ఇస్తున్న టాలీవుడ్ హీరోలు.. భారీగా రెమ్యూనరేషన్ పెంచిన మరో యంగ్ స్టార్…