Akhil Akkineni: ఎప్పుడొస్తారు ఏజెంట్‌.. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తన్న అయ్యగారి ఫ్యాన్స్

|

Jul 25, 2022 | 7:25 PM

అయ్యగారు థియేటర్‌కి ఎప్పుడు వస్తారో అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు అఖిల్ ఫ్యాన్స్. ఎజెంట్ విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.

Akhil Akkineni: ఎప్పుడొస్తారు ఏజెంట్‌.. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తన్న అయ్యగారి ఫ్యాన్స్
Follow us on

Tollywood: అక్కినేని ప్రిన్స్‌ అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్‌(Agent). ఇప్పటికే చాలా డిలే అయిన ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తాం అంటూ ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. డేట్ అయితే ఇచ్చారు గానీ… ప్రమోషన్ విషయంలో మాత్రం ఆ రేంజ్‌ చూపించటం లేదు. దీంతో ఈ మూవీ ఆడియన్స్‌ ముందుకు ఎప్పుడొస్తుందన్న కన్‌ఫ్యూజన్‌ క్రియేట్ అవుతోంది. అక్కినేని వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అఖిల్‌…. హీరోగా ప్రూవ్ చేసుకున్నా…. స్టార్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వటం విషయంలో మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నారు. ఆ లోటు తీర్చేందుకే భారీ బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాతో రెడీ అవుతున్నారు అక్కినేని సిసింద్రీ. ఆల్రెడీ డ్యాన్స్‌, యాక్షన్‌ విషయంలో ఫుల్‌ మార్క్స్‌ సాధించిన ఈ నవ యువ సామ్రాట్‌… ఇప్పుడు కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్‌ చేసుకునే పనిలో ఉన్నారు. అందుకే స్టైలిష్ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి(Surender Reddy)తో కలిసి వరల్డ్ క్లాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం కన్‌ఫ్యూజన్‌ కంటిన్యూ అవుతోంది.

కోవిడ్ బ్రేక్ పడకపోయుంటే ఏజెంట్ ఎప్పుడో ఆడియన్స్ ముందుకు వచ్చుండేది. కానీ కరోనా కారణంగా డిలే కావటంతో రిలీజ్ ఆలస్యమైంది, ఆ మధ్య ఆగస్టు 12న రిలీజ్ అంటూ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చింది టీమ్‌. కానీ ఆ తరువాత ప్రమోషన్స్‌లో రిలీజ్‌ డేట్‌ ఊసే ఎత్తటం లేదు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌లోనూ కమింగ్ సూన్‌ అంటూ సస్పెన్స్‌లో పెట్టారే గానీ… రిలీజ్‌ డేట్‌ ఎప్పుడన్న క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఏజెంట్ ఎంట్రీ ఎప్పుడంటూ ఎంక్వైరీలు మొదలు పెట్టారు అక్కినేని అభిమానులు. మరి ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌ల తరువాతైనా ఏజెంట్ టీమ్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..