
నటుడు శ్రీనివాస్ రెడ్డి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో, రాజీవ్ కనకాలతో తన అనుబంధం గురించి, వారి మధ్య జరిగిన అనేక ఎమోషనల్, సరదా సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సంభాషణలో ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఆయన ప్రొఫెషనలిజం, అలాగే వారి స్నేహంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను అత్యంత తెలివైన, వేగంగా ఆలోచించే వ్యక్తి అని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. “టేప్ రికార్డర్ లో ఫార్వర్డ్ బటన్ కొడితే ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో, అంత ముందు ఆలోచిస్తాడు” అంటూ ఎన్టీఆర్ ఆలోచనా విధానాన్ని వివరించారు. ఆయన ఒక పాట విన్నాడంటే నాన్ స్టాప్ గా పాడుతారని, అలాగే స్పందించే హృదయం కలిగిన ఎమోషనల్ వ్యక్తి అని తెలిపారు శ్రీనివాస్ రెడ్డి. తన అభిమానుల సమస్యలపై, లేదా ఇతరులకు ఏదైనా జరిగితే ఎన్టీఆర్ తక్షణమే స్పందిస్తారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఒక ప్రమాద ఘటనను శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అది డీప్ కర్వ్ ఉన్న ప్రదేశమని, సఫారీ కారు కరెక్ట్ గా కట్ అయ్యే టైమ్ కి కొట్టేసిందని చెప్పారు. పక్కనే పెద్ద బావి ఉన్నందున, కొద్దిగా ముందు కట్ అయి ఉంటే కారు నేరుగా బావిలో పడేదని, దేవుడు ఉన్నాడని చెప్పడానికి అదే నిదర్శనమని అన్నారు. ఆ ప్రమాదంలో రాజీవ్ కనకాల, మరో మిత్రుడు పెద్ది గాయపడ్డారని, ఎన్టీఆర్ కు కూడా తలకి దెబ్బ తగిలి స్టిచెస్ పడ్డాయని తెలియజేశారు.
వజ్రోత్సవాల సందర్భంగా జరిగిన ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ ను శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ స్కిట్ లో తాను చిత్రగుప్తుడిగా, రాజీవ్ కనకాల యముడిగా, జూనియర్ ఎన్టీఆర్ మరో యముడి పాత్రలో నటించారు. మంచి మూమెంట్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మైక్ ఊడిపోవడంతో తాను క్యారెక్టర్ మర్చిపోయి భయపడ్డానని చెప్పారు. కానీ ఎన్టీఆర్ ప్రొఫెషనలిజంతో వ్యవహరించి, “మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా.?” అని అడగడం అక్కడున్న వారిని పులకరింపజేసిందని వివరించారు. ఈ సంఘటన ఎన్టీఆర్ సమయస్ఫూర్తిని, క్రమశిక్షణను తెలియజేస్తుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.