తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది కమెడియన్లలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. మిమిక్రీ కళతో టీవీరంగంలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ రెడ్డి.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన నటనతో అలరిస్తూ ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. మాస్ మాహారాజా రవితేజ నటించిన ఇడియట్ సినిమాలో హీరో స్నేహితుడిగా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. నాగ, విజయం, వెంకీ, గౌరి, ఢీ, దుబాయ్ శీను, దేశముదురు, కింగ్, రెడీ, పరుగు, ఆంజనేయులు, బెండు అప్పారావు, నమో వెంకటేశ ఇలా అనేక సినిమాల్లో అలరించాడు. గీతాంజలి సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్ రెడ్డి.. ఆ తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలోనూ హీరోగా అలరించారు.
కథానాయకుడిగా మెప్పించినా తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా మళ్లీ అవకాశాలు రాలేదు. ఇటీవలే గీతాంజలి 2 సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే.. శ్రీనివాస్ రెడ్డి సినిమాల్లో తప్ప బయట మరెక్కడా అంతగా కనిపించరు. ఇక ఆయన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా జనాలకు తెలియదు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
కమెడియన్, హీరోగా మెప్పించిన శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగానూ మారాడు. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు శ్రీనివాస్ రెడ్డి. ఇందులో సత్య, షకలక శంకర్ కీలకపాత్రలు పోషించగా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హస్యనటుడిగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.