అమ్మబాబోయ్.. ఆ హీరో పైకి కనిపించేంత సైలెంట్ కాదు..! సెట్‌లో తెగ గోల చేసేవాడు

ప్రభాస్, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు, తన అభిమానుల, సన్నిహితుల పట్ల చూపించే అపారమైన ప్రేమ, ఆతిథ్యం వల్ల డార్లింగ్గా కూడా పేరు పొందారు. అయితే నటుడు ప్రభాస్ శ్రీను ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో తన సుదీర్ఘ అనుబంధం, ఆయన ఆతిథ్యం, సరదా కోరికలు, అలాగే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అమ్మబాబోయ్.. ఆ హీరో పైకి కనిపించేంత సైలెంట్ కాదు..! సెట్‌లో తెగ గోల చేసేవాడు
Prabhas Sreenu

Updated on: Sep 01, 2026 | 12:21 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మహేష్ సినిమా సెట్‌లో ఎంత సరదాగా, జోవియల్‌గా ఉంటారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. చాలా మంది సెలబ్రెటీలు ఆయన పనిచేసిన అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. అలాగే గతంలో పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను, మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని అరుదైన, ఆహ్లాదకరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆగడు చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ బాబు చేసిన అల్లరి, తమపై వేసిన జోకులు గురించి ఆయన మాట్లాడారు.

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

ప్రభాస్ శ్రీను తన ఇంటర్వ్యూలో మహేష్ బాబును చూస్తే చాలా కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉంటారని చాలా మంది అనుకుంటారని, కానీ మేకింగ్ వీడియోలలో మాత్రం ఆయన చుట్టూ ఉన్నవాళ్లందరూ పడి పడి నవ్వుకుంటారని తెలిపారు. “ఆయన చాలా జోవియల్‌గా ఉంటారు. బయటికి వచ్చినప్పుడు తక్కువ కనిపిస్తారు, కనిపించేదే తక్కువ, దాంట్లో కూడా చురకలు పడతా ఉంటాయి” అని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆగడు సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన వివరంగా వెల్లడించారు.

Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ

బాంబేలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో షూటింగ్ జరుగుతోందని, ఆ వేడిమికి సెట్‌లో అందరూ అల్లాడిపోయారని శ్రీను పేర్కొన్నారు. బ్రహ్మానందం గారికి, ఇతర నటీనటులకు చెమటలు కారిపోయాయని, సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు సెట్‌లో దాదాపు 25-26 డినో లైట్లు పెట్టారని, ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా మారిందని వివరించారు. ప్యాకప్ ఎప్పుడు అవుతుందా అని ఆర్టిస్టులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, స్కూల్ సెలవులు ఇస్తే పిల్లలు ఎంత ఆనందంగా పరుగెడతారో, అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ప్యాకప్ తర్వాత సెట్ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాంటి సమయంలో, మహేష్ బాబు దర్శకుడు శ్రీను వైట్లను ఆటపట్టిస్తూ, “డైరెక్టర్ గారు వెళ్లి గ్లాసులు కడిగేస్తావా, పడుకుంటావా?” అని సరదాగా అన్నారట. “రూమ్‌కి వెళ్లి పడుకుంటావా, లేక గ్లాసులు కడిగేస్తావా..?” అని అడగడం అందరిని నవ్వించిందని అన్నారు. అలాగే మరో సందర్భంలో, ఆగడు షూటింగ్ సమయంలో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే. దీనిపై మహేష్ బాబు “ఆహా ఈ ప్రాక్టీస్ అంతా రాత్రి తాగడానికేనా?” అని ప్రభాస్ శ్రీనును సరదాగా అడిగారట. దానికి శ్రీను, “కాదు సార్, ఊరికే ఆరోగ్యంగా ఉండటం కోసం తాగుతున్నాను. నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, బార్లీ ఇవన్నీ దీనికి రాత్రి కోసమేనా ప్రాక్టీస్ అంతా” అని మహేష్ బాబు పదేపదే ఆటపట్టించినట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us