ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నవారు చాలామంది ఉన్నారు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన హస్యనటులు ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో హస్యనటుడు జనగరాజ్ ఒకరు. సౌత్ ఇండస్ట్రీలో 200 పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. మొదట్లో డైరెక్టర్ భారతీరాజా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. అందులో ఫేమస్ కావడంతో నటుడిగా అవకాశాలు వచ్చాయి.
రజినీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపించారు. అప్పట్లో ఏడాదికి 20 సినిమాల వరకు నటించాడు. 90’sలో చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన ఆయన.. 2000వ సంవత్సరంలో కాస్త స్లో అయ్యాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. అప్పట్లో ఆయన అమెరికాలో సెటిల్ అయ్యాడని రూమర్స్ వినిపించగా.. అవన్ని అవాస్తవమే అని కొట్టిపరేశారు నటుడు జనగరాజ్.
చివరగా డైరెక్ట్ర బాల దర్శకత్వం వహించిన ఒబామా ఉంగలుక్కగా చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 2018లో త్రిష, విజయ్ సేతుపతి నటంచిన 96 చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో వాచ్ మెన్ పాత్రలో కనిపించారు. అప్పటికే పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇక ఇటీవలే తాత అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ప్రస్తుతం జనగరాజ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బక్కచిక్కపోయి కనిపిస్తున్న జనగరాజ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.